మేషం (Aries)
మేషరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. కుటుంబ సభ్యుల అవసరాలు, కోరికలు మొట్టమొదటి ప్రాధాన్యతగా ఉండాలి. కోపం అదుపులో పెట్టుకోవాలి. ఉన్నతాధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి. వివాదాలకు, అపవాదాలుకు దూరంగా ఉంటే మంచిది.
వృషభం (Taurus)
వృషభరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఆర్థికవృద్ధి, ధన లాభాలు ఉంటాయి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఒక శుభవార్త మీకు సంతోషం కలిగిస్తుంది. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం శాంతియుతంగా ఉంటుంది.
మిథునం (Gemini)
మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఇంటా బయటా కలహపూరిత వాతావరణం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. ఉద్యోగులు తమ పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారాలు కీలక నిర్ణయాల విషయంలో భాగస్వాములను సంప్రదించడం మంచిది
కర్కాటకం (Cancer)
కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఆదాయ వనరులు పెరగడంతో ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కుటుంబ సభ్యులతో, బంధు మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు.
సింహం (Leo)
సింహరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అపారమైన ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం ఈ రోజు మీ జీవితంలో అద్భుతాలు చేస్తాయి. ఉద్యోగులు అన్ని పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రమోషన్ ఉండవచ్చు. ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.
కన్య (Virgo)
కన్యారాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి ప్రతికూలతలు లేని అద్భుతమైన రోజు. ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ మిత్రుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది.
తుల (Libra)
తులారాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. మీ పరుషమైన మాటలతో, కఠినమైన ప్రవర్తనతో ఇతరులను బాధ పెట్టకుండా చూసుకోండి. కోపం వల్ల ఏ సమస్యలూ తీరవు. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండడం అవసరం. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సురాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అదృష్టం అవకాశాలుగా మారి ఎదురవుతాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఇంట్లో, పని ప్రదేశంలో శాంతియుత వాతావరణం ఏర్పడుతుంది.
మకరం (Capricorn)
మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనారోగ్యం కారణంగా పనిపట్ల ఏకాగ్రత లోపిస్తుంది. వైద్యఖర్చులు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో నిర్ణయం తీసుకునే శక్తి కొరవడుతుంది. పని ప్రదేశంలో వ్యతిరేక పరిస్థితులు ఉండవచ్చు. ఎట్టి పరిస్థిత్లులో మనోధైర్యాన్ని కోల్పోకండి.
కుంభం (Aquarius)
కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో మొండిపట్టు వీడి రాజి ధోరణి అవలంబిస్తే మంచిది. చేపట్టిన పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోండి. వృధా ఖర్చులు తగ్గించుకుంటే మంచిది.
మీనం (Pisces)
మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో శ్రమ పెరగవచ్చు. ఉద్యోగులు పని పట్ల ఏకాగ్రత లోపించకుండా జాగ్రత్త పడండి. సహోద్యోగుల సహకారంతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్థలకు అవకాశముంది.