Tirupathi | ప్రొఫెస‌ర్ లైంగిక‌దాడి.. గ‌ర్భం దాల్చిన బీఈడీ విద్యార్థిని

Tirupathi | విద్యార్థుల‌కు విద్యా బుద్ధులు నేర్పి వారిని ప్ర‌యోజ‌కులుగా తీర్చిదిద్దాల్సిన ప్రొఫెస‌ర్ కీచ‌కుడిగా మారాడు. ఓ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్ప‌డ‌డంతో ఆమె గ‌ర్భం దాల్చింది.

Tirupathi | తిరుప‌తి : విద్యార్థుల‌కు విద్యా బుద్ధులు నేర్పి వారిని ప్ర‌యోజ‌కులుగా తీర్చిదిద్దాల్సిన ప్రొఫెస‌ర్ కీచ‌కుడిగా మారాడు. ఓ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్ప‌డ‌డంతో ఆమె గ‌ర్భం దాల్చింది. ఈ ఘ‌ట‌న తిరుప‌తి జాతీయ సంస్కృత యూనివ‌ర్సిటీలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఒడిశాకు చెందిన ఓ విద్యార్థిని తిరుప‌తి జాతీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యంలో బీఈడీ చేస్తుంది. ఈ క్ర‌మంలో ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్ కుమార్.. స‌ద‌రు విద్యార్థినిపై లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు. మ‌రో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ శేఖ‌ర్ రెడ్డి వీడియో తీసి బాధిత విద్యార్థినిని లైంగికంగా కొంత‌కాలం వేధింపుల‌కు గురి చేశాడు. మొత్తానికి బాధితురాలు గ‌ర్భం దాల్చింది. దీంతో ప్రొఫెస‌ర్ భ‌య‌ప‌డి.. ఆమెను బెదిరించి ఇంటికి పంపించేశాడు.

ఈ విష‌యం యూనివ‌ర్సిటీ వీసీ దాకా చేరింది. దీంతో ఇంచార్జి వీసీ ర‌జ‌నీకాంత్ శుక్లా తిరుప‌తి వెస్ట్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ల‌క్ష్మ‌ణ్ కుమార్, శేఖ‌ర్ రెడ్డి సెల్‌ఫోన్ల‌ను సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు సీఐ ముర‌ళీ మోహ‌న్ తెలిపారు.

అయితే ఈ ఘ‌ట‌న‌పై బాధిత విద్యార్థిని ప‌ది రోజుల కింద‌టే వీసీ కృష్ణ‌మూర్తికి లిఖిత‌పూర్వ‌కంగా ఫిర్యాదు చేసిన‌ట్లు తెలుస్తుంది. దీంతో లైంగిక‌దాడి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ ల‌క్ష్మ‌ణ్ కుమార్‌ను ఈ నెల 1వ తేదీన స‌స్పెండ్ చేయగా, 2 నుంచి ఆయ‌న విధుల‌కు రావ‌డం లేద‌ని వ‌ర్సిటీ విద్యార్థులు తెలిపారు. ల‌క్ష్మ‌ణ్ కుమార్‌పై విచార‌ణ‌కు అంత‌ర్గ‌త ఫిర్యాదుల క‌మిటీని సైతం నియ‌మించిన‌ట్లు స‌మాచారం.

Latest News