Horoscope | నేటి రాశిఫ‌లం.. ఈ రాశివారు లక్ష్మీకటాక్షంతో ఐశ్వర్యవంతులవుతారు

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు కొత్త అవకాశాలు అందుకుంటారు. ఆర్థికాభివృద్ధికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కీలక వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యుల సలహాలు పాటించడం మంచిది. ప్రతికూల ఆలోచనలు విడిచి పెట్టండి.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి పరంగా కృషికి తగిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో అధికారుల ప్రోత్సాహం ఉత్సాహాన్నిస్తుంది. కుటుంబ విభేదాలు తొలగిపోతాయి. ఆర్థికంగా శుభయోగాలున్నాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో వృత్తి పరమైన అడ్డంకులు అధిగమిస్తారు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. ఖర్చులు అదుపులో ఉంచుకోవడం అవసరం. బంధు మిత్రులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు విలువ ఇవ్వడం మంచిది.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సన్నిహితులు, సహచరుల సహకారంతో ఉద్యోగ వ్యాపారాలలో విజయం సాధిస్తారు. స్థిరమైన నిర్ణయాలు మేలు చేస్తాయి. కుటుంబ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ప్రగతి గోచరిస్తోంది. మనోధైర్యంతో ముందడుగు వేస్తే విజయం మీదే! ఉద్యోగులకు బదిలీలు ఉండవచ్చు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆదాయం పెరుగుతుంది.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి చేపట్టిన ప్రతి పనిలో నిదానంగా వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. కుటుంబంలో ఏర్పడే సమస్యలు అశాంతి కలిగిస్తాయి. ఆదాయం ఆశించిన మేరకు ఉండకపోవచ్చు. పెరిగే ఖర్చులు మానసిక ఒత్తిడికి గురిచేస్తాయి.

తుల (Libra)

తుల రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పట్టుదలతో చేపట్టిన పనుల్లో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. సహనంతో ఉంటే అన్నీ సర్దుకుంటాయి. మీ సహనమే మీకు శ్రీరామరక్ష. ఒక తీర్థయాత్ర ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. శుభప్రదమైన భవిష్యత్తు గోచరిస్తోంది. అన్ని రంగాల వారికి కార్యసిద్ధి, శత్రుజయం ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు ఉండవచ్చు. ఆధ్యాత్మిక మార్గం వైపుగా మీ ప్రయాణం సాగుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో శుభవార్తలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా ఎదగడానికి చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగ వ్యాపారాలలో మిత్రుల సహకారం ఉంటుంది. స్థిరమైన బుద్ధితో తీసుకునే నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి. చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక లబ్ధి ఉంటుంది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. శ్రేష్టమైన శుభ సమయం నడుస్తోంది. శుభప్రదమైన భవిష్యత్తు ఎదురుచూస్తోంది. లక్ష్మీకటాక్షంతో ఐశ్వర్యవంతులవుతారు. ఉద్యోగ వ్యాపారాలలో శుభవార్తలు అందుకుంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి.షేర్ మార్కెట్ పెట్టుబడులు మంచి లాభాలు అందిస్తాయి. ఉద్యోగులు మాత్రం కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. చేపట్టిన పనుల్లో శ్రద్ధ, ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఇంటా బయటా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. ఉద్యోగులు అధికారులతో జాగ్రత్తగా నడుచుకోవాలి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. చిన్న చిన్న సమస్యలు భూతద్దంతో చూసి ఆందోళన చెందవద్దు. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు.