Horoscope | బుధ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ప‌ద‌వీ యోగం..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. మీ ప్రతిభతో, తెలివితేటలతో అందరి దృష్టిని ఆకర్షిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో శుభ సమయం నడుస్తోంది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరంగా కొన్ని కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మనోబలం తగ్గకుండా చూసుకోండి. ఉద్యోగ వ్యాపారాలలో ఆచి తూచి అడుగేయాలి. ఖర్చులు బాగా పెరుగుతాయి. ఘర్షణలు, వాదనలు, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మానసిక ఆనందం కలిగించే అనేక సంఘటనలు జరుగుతాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఆటంకాలు సమయస్ఫూర్తితో అధిగమిస్తారు. మీ పరోపకార గుణం కారణంగా సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది. ఒక సంఘటన మీ ఆత్మవిశ్వాసం పెంచుతుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో ప్రణాళికతో నడుచుకోవాలి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. చేపట్టిన పనుల్లో విజయం కోసం శ్రమించాల్సి ఉంటుంది. కొందరి ప్రవర్తన మనస్తాపం కలిగిస్తుంది. డబ్బుకు లోటుండదు. ఆదాయం వృద్ధి చెందుతుంది.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు పట్టుదలతో అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మేలు చేస్తాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా గడిచిపోతుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. సన్నిహితులతో ఆహ్లాదకరమైన ప్రయాణాలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో శ్రద్ధ పెట్టాలి.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో చిన్న చిన్న సమస్యలున్నా అధిగమించి విజయం సాధిస్తారు. ఆర్థికంగా ఈ రోజు గొప్ప శుభ యోగాలున్నాయి. ఉద్యోగులు, వ్యాపారాలు ఊహించని ధనలాభాలు అందుకుంటారు. షేర్ మార్కెట్ పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తాయి. వృత్తి పరంగా నూతన అవకాశాలు అందుకుంటారు.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. చేపట్టిన పనుల్లో నిర్లక్ష్యం తగదు. వ్యాపారంలో నష్ట భయం ఉంది కాబట్టి ముందుచూపుతో నడుచుకోవాలి. కుటుంబ వ్యవహారాల్లో సమయానుకూల నిర్ణయాలు మేలు చేస్తాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. డబ్బు విపరీతంగా ఖర్చవుతుంది.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం కోసం శ్రమించాల్సి ఉంటుంది. వ్యాపారంలో లాభాలు తగ్గడం ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో అదృష్ట యోగం ఉంది. కీలక బాధ్యతలు చేపడతారు. పదవీయోగం ఆనందం కలిగిస్తుంది. సన్నిహితుల నుంచి బహుమతులు అందుకుంటారు. కుటుంబంలో ఆనందకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా సాధారణ ఫలితాలు ఉండవచ్చు. పట్టుదలతో ముందుకు సాగితే ఆశించిన ఫలితాలు అందుకుంటారు. కుటుంబంలో విభేదాల కారణంగా శాంతి, సామరస్యత నెలకొల్పడం కష్టసాధ్యం అవుతుంది. అనవసర చర్చలు, వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. ఆర్థికంగా ఖర్చులు పెరిగినా ఆదాయం కూడా పెరగడంతో ఇబ్బంది ఉండదు.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహగతులు అనుకూలంగా లేనందున ప్రతి అడుగు ఆచి తూచి వేయాల్సి ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి నిరాశ పరుస్తుంది. ప్రణాళిక లోపంతో ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో సహనంగా ఉండటం మంచిది.

Latest News