మేషం (Aries)
మేషరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. మనోల్లాసం కలిగించే అనేక సంఘటనలు జరుగుతాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు బుద్ధిబలంతో అధిగమిస్తారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. వృత్తి పరంగా ముఖ్యమైన చర్చలు ఫలిస్తాయి.
వృషభం (Taurus)
వృషభరాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో విజయావకాశాలు మెరుగవుతాయి. తక్కువ ప్రయత్నంతోనే లక్ష్యాలను సాధిస్తారు. నూతన అవకాశాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తి కలిగిస్తుంది.
మిథునం (Gemini)
మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. ఈ రోజు కొత్త పనులు చేపట్టడానికి శుభప్రదంగా లేదు. ఉద్యోగ వ్యాపారాలలో ఆచి తూచి అడుగేయాలి. వివాదాలు, వాదనలకు దూరంగా వుండండి. ఆర్థికంగా కొన్ని చిక్కులు ఉండవచ్చు. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేయండి.
కర్కాటకం (Cancer)
కర్కాటకరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. చేపట్టిన పనుల్లో సమస్యలు, సవాళ్లు వెంటాడుతాయి. కొత్త వ్యవహారాలు మొదలు పెడితే ఇబ్బందులు రావచ్చు కాబట్టి వాయిదా వేయండి. కుటుంబ వ్యవహారాల్లో శాంతం వహించండి. కొందరి ప్రవర్తన మనస్థాపం కలిగిస్తుంది.
సింహం (Leo)
సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలను బుద్ధిబలంతో అధిగమిస్తారు. వ్యాపారులు భాగస్వాములతో జాగ్రత్తగా నడుచుకోవాలి. సమిష్టి నిర్ణయాలకు ప్రాధాన్యత ఇస్తే మంచిది. కోపావేశాలు అదుపులో ఉంచుకోండి. ఆర్థికాభివృద్ధి ఉంటుంది.
కన్య (Virgo)
కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మిత్రుల సహకారంతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. మీ ప్రతిభ, సమర్ధతకు పురస్కారాలు అందుకుంటారు. కీలక వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం. ఉద్యోగులు పదోన్నతులు అందుకుంటారు. ఆర్థికపరమైన పురోగతి ఉంటుంది.
తుల (Libra)
తులారాశి వారికి ఈ రోజు సామాన్య ఫలితాలు వుంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. సహనంతో నడుచుకుంటే మంచిది. కీలక నిర్ణయాలలో చంచలత్వం పనికిరాదు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ వ్యవహారాల్లో శాంతం వహించండి.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. నాయకత్వ లక్షణాలతో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. పదోన్నతులు, జీతం పెరుగుదల వంటి శుభ ఫలితాలు ఉంటాయి. వృత్తిలో పురోగతికి సంబంధించి శుభవార్త వింటారు.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో వృత్తి పరమైన ఆటంకాలను అధిగమిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో పట్టుదల, ఏకాగ్రత పెంచాలి. ఒక సంఘటన విచారం కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో స్వల్ప వివాదాలు ఉండవచ్చు. సహనంగా ఉంటే మంచిది.
మకరం (Capricorn)
మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. బుద్ధిబలంతో వ్యవహరించి క్లిష్టమైన సమస్యలు పరిష్కరిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో తీర్థయాత్రలకు వెళ్తారు.
కుంభం (Aquarius)
కుంభరాశి వారికి ఈ రోజు బ్రహ్మాండంగా ఉంటుంది. గ్రహ సంచారం అద్భుతంగా ఉంది. ఈ రోజు ఏ పని తలపెట్టినా విజయం వెన్నంటే ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థిక లాభాలు ఆనందం కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఒక విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది.
మీనం (Pisces)
మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అనుకూలమైన సమయం. ఉద్యోగంలో మీ అధికార పరిధి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు ఆనందం కలిగిస్తాయి. చేపట్టిన పనుల్లో వేగంగా విజయం లభిస్తుంది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.