విధాత : రాష్ట్రానికి రక్షణాధిపతి కాస్తా..రాసలీల వ్యవహారంలో రోడ్డున పడిన వ్యవహారం కర్ణాటకలో రచ్చ రేపుతుంది.
కర్నాటకలో డీజీపీ ర్యాంక్ ఐపీఎస్ ఆఫీసర్ డాక్టర్ రామచంద్రరావుకు చెందిన రాసలీలల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. రామచంద్రారావు తన కార్యాలయంలోనే వేర్వేరు మహిళలతో సరసరాలు సాగిస్తున్న వీడియోలు బహిర్గతమవ్వడం సంచలనంగా మారింది. తన ఆఫీసు చాంబర్ కుర్చీలోనే కూర్చుని కార్యాలయ మహిళా సిబ్బందితో అభ్యంతకరంగా హగ్గింగ్ లు, కిస్సింగ్ లుతో సరసలాడాడు. ఇందుకు సంబంధించిన వీడియోలో రామచంద్రరావు ఓసారి ఖాకీ యూనిఫామ్ లో, మరోసారి సివిల్ దుస్తులలో వేర్వేరు మహిళా సిబ్బందితో కనిపించారు.
సీఎం సిద్దరామయ్య సీరియస్
డీజీపీ ఆఫీసులోని సిబ్బందినే ఈ వీడియోను చాలా సీక్రెట్‌గా రికార్డింగ్ చేశారని… కనీసం అయిదారు నెలల క్రితం ఆ వీడియో తీసినట్లు అనుమానిస్తున్నారు. అయితే డీజీపీ రామచంద్ర రావు మాత్రం తాను ఏ తప్పు చేయలేదని, అది మార్ఫింగ్ చేసిన వీడియో అని, నన్ను టార్గెట్ చేసి బద్నామ్ చేసే కుట్ర చేశారని ఆరోపిస్తున్నారు. దీనిపై తన లాయర్లతో చర్చించి వాస్తవాలు వెల్లడిస్తానన్నారు. మరోవైపు డీజీపీ రామచంద్రారావు రాసలీలల వీడియో వ్యవహారం రచ్చపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లుగా సమాచారం.
విధి నిర్వహణలో రామచంద్రరావు ఇప్పటికే అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన కుమార్తె నటి రన్యారావుకు ఆయన సవతి తండ్రి. రామచంద్రరావు పేరు వాడుకునే రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కు పాల్పడినట్లుగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇప్పుడు రామచంద్రారావు తన ఆఫీసులోనే మహిళా సిబ్బందితో హగ్గింగ్, కిస్సింగ్ ల వీడియోతో మరో వివాదంలో ఇరుక్కున్నారు
ఇవి కూడా చదవండి :
Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డికి వరుస షాక్ లు.. సుశీ ఇన్ ఫ్రాపై సీబీఐ కేసు !
Outsourcing Corporation | ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త! టీజీ ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు యత్నాల్లో సర్కార్?
