Site icon vidhaatha

గురువారం విశిష్ట‌త మీకు తెలుసా..? ఇవాళ వారిని నిందించ‌కూడ‌ద‌ట‌..!

హిందూ ధ‌ర్మంలో ప్ర‌తి రోజుకు ఒక ప్ర‌త్యేక‌త ఉంది. వారంలోని ఏడు రోజుల్లో ఒక్కోరోజు ఒక్కో దేవుడిని ఆరాధిస్తుంటారు. గురువారం రోజు విష‌యానికి వ‌స్తే ఎంతో శుభ‌ప్ర‌దం. మిగ‌తా రోజుల్లో ఆ ప‌ని చేయ‌కూడ‌దు.. ఈ ప‌ని చేయ‌కూడ‌దు అని నిబంధ‌న‌లు పెడుతారు. కానీ గురువారం రోజు ఏ ప‌ని చేప‌ట్టినా విజ‌య‌వంత‌మై తీరుతుంద‌నేది న‌మ్మ‌కం. అందుకే గురువారం చాలా మంది చాలా ప‌నులు ప్రారంభిస్తుంటారు. మ‌రి గురువారం విశిష్ట‌త ఏంటో తెలుసుకుందాం..

గురువారంను శుభ‌దినం అని జ్యోతిష్య‌త పండితులు పిలుస్తారు. గురువారం రోజున గృహ ప్ర‌వేశాలు చేస్తే మంచిదని చెబుతున్నారు. గురువారం నాడు దత్త ఆరాధన చేయడం, దత్త ఉపవాసం చేయడం కూడా చాలా మంచిది అని చెబుతున్నారు పండితులు.

ఎవరైతే దత్తాత్రేయుడి కి పూజ చేస్తారో వాళ్లకి యోగ దాయకమైన రోజు ఇది. అలానే చాలా మంది పిల్లలకు చదివినది గుర్తు ఉండదు. ఇట్టే చదివినది మర్చిపోతారు. అలాంటి పిల్లలు గురువారం నాడు దత్తాత్రేయుడు కి పూజ చేయడం వల్ల చదివినవి గుర్తు ఉంటాయి. అలానే దక్షిణామూర్తి ఆరాధన కనక గురువారం నాడు చేస్తే ఉజ్వల భవిష్యత్తు వాళ్ళ సొంతమవుతుంది. గురువారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని నిందించకూడదు. ముఖ్యంగా గురువులని అసలు నిందించకూడదు అని పండితులు అంటున్నారు.

Exit mobile version