విధాత:గంపలగూడెం మండలం నెమలిలోని వేణుగోపాలస్వామి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి.ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించి నూతన వస్త్రాలు, ఆభరణాలు, పుష్పాలతో అలంకరించారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ కృష్ణుడి ని దర్శించుకున్నారు.దేవస్థానం పాలక,ధర్మకర్తల మండలి ఛైర్మన్ కావూరి శశిరేఖ, ఆలయ సహాయ కమీషనర్ ఎన్. సంధ్య ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు..
స్వామివారికి ప్రీతిపాత్రమైన తొమ్మిది రకాల ప్రసాదాలతో నివేదన చేశారు. భక్తులకు 9 రకాల ప్రసాదాలను పంపిణీ చేశారు.ఆలయ ప్రాంగణంలో నవనీతకృష్ణ అలంకృతులైన స్వామివారికి ఉట్టి కొట్టే ఉత్సవం నిర్వహించారు.రాత్రికి రుక్మిణి, సత్యభామా సమేతుడైన స్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక రథంపై ఆశీనులను చేసి మేళతాళాలతో గ్రామోత్సవం నిర్వహించారు.కృష్ణా, ఖమ్మం జిల్లాల నుంచి భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వేడుకల్లో పాల్గొన్నారు.