Shani Amavasya 2025 | ఆగస్టు 23న శని అమావాస్య – శనిదేవుని ప్రసన్నం చేసుకునేవిశిష్ట తిథి

Shani Amavasya | 2025 ఆగస్టు 23న శని అమావాస్య ప్రత్యేకత, పూజా విధానం, దానాలు, మంత్రజపం, ఏలినాటి శని నివారణ పరిహారాలు, శనిదేవుని నిజమైన తత్త్వం – శని అనుగ్రహం పొందే మార్గాలపై పూర్తి వివరాలు.

Shani Amavasya |హిందూ సంప్రదాయంలో అమావాస్య తిథులకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ప్రతి నెలా వచ్చే 12 అమావాస్యల్లో, శనివారం నాడు వచ్చే అమావాస్యను ప్రత్యేకంగా శని అమావాస్యగా పిలుస్తారు. 2025 సంవత్సరంలో ఈ శని అమావాస్య ఆగస్టు 23వ తేదీన రానుంది. ఈ తిథి ఆగస్టు 22 ఉదయం 11.56 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 23 ఉదయం 11.36 గంటలకు ముగుస్తుంది. ఆ రోజున సూర్యోదయం సమయంలో అమావాస్య తిథి ఉండటంతో 23వ తేదీ శనివారంనే శని అమావాస్యగా పరిగణిస్తారు.

జ్యోతిష్య పండితుల అభిప్రాయం ప్రకారం, ఈ రోజున శనిదేవుడిని ప్రత్యేకంగా పూజిస్తే సకల కష్టాలు తొలగి ఆర్థికాభివృద్ధి, కుటుంబ శాంతి, ఆరోగ్య శ్రేయస్సు లభిస్తాయి. ముఖ్యంగా ఏలినాటి శని, సాడే సతి, అష్టమ శని ప్రభావంతో బాధపడుతున్నవారికి ఈ రోజు ఎంతో శ్రేయస్కరం.

శని అమావాస్య ప్రత్యేకత

శని అమావాస్య రోజున చేయాల్సిన పూజలు, పరిహారాలు

  1. తైలాభిషేకం:
    శనిగ్రహ విగ్రహానికి నువ్వుల నూనె లేదా ఆవనూనెతో అభిషేకం చేయాలి. ఇది శనిదేవుడిని శాంతింపజేస్తుంది.
    • మందపల్లి శనేశ్వరస్వామి ఆలయం (AP)
    • హయత్‌నగర్ శని ఆలయం (Hyderabad)
    • మింట్​ కాంపౌండ్​ శనైశ్చరాలయం (Hyderabad)
    • శనిసింగనాపూర్​ ఆలయం (Maharashtra)వంటి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
  2. మంత్రజపం:
    • ‘శం శనైశ్చరాయ నమః’ – 108 సార్లు
    • మహామృత్యుంజయ మంత్రం – 108 సార్లు
    • ఓం నమః శివాయ పంచాక్షరీ – నిరంతరం జపించాలి
    • శని గాయత్రీ: ఓం ప్రాం ప్రీం ప్రౌం సః శనైశ్చరాయ నమః
  3. దీపారాధన:
    • ఇంట్లో దక్షిణ దిశలో నువ్వుల నూనె దీపం వెలిగించాలి.
    • రావి చెట్టు క్రింద దీపారాధన చేసి 7 లేదా 9 ప్రదక్షిణలు చేయాలి.
  4. దానాలు:
    • ఇనుప వస్తువులు, చెప్పులు, నల్ల నువ్వులు, మినప్పప్పు, నల్ల బట్టలు, బెల్లం–పిండి పదార్థాలు దానం చేయాలి.
    • పేదలకు దుప్పట్లు, ఆహారం, డబ్బు దానం చేస్తే శనిదేవుని కరుణ లభిస్తుంది.
  5. జంతువులకు ఆహారం:
    • కాకులకు, నల్ల ఆవులకు, నల్ల కుక్కలకు ఆహారం పెడితే శని ప్రభావం తగ్గుతుంది.
  6. శివారాధన:
    శనిదేవుడికి శివుడు అత్యంత ప్రీతికరుడు. కాబట్టి శివలింగానికి జలాభిషేకం, పంచామృతాభిషేకం చేసి, బెల్లం నైవేద్యం సమర్పించాలి.

శని అమావాస్య రోజున మానుకోవలసిన పనులు

శనిదేవుడు భయపడవలసిన దేవుడు కాదు

చాలామంది శనిదేవుని శిక్షించే దేవుడు, విలన్ అని భావిస్తారు. కానీ శాస్త్రాల ప్రకారం ఆయన అసలు కర్మఫలదాత.

ఆధ్యాత్మిక సారాంశం

శని అమావాస్య రోజున పూజలు, దానాలు, తర్పణాలు చేయడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు, శనిదేవుని అనుగ్రహం, ఆర్థికాభివృద్ధి, ఆరోగ్య శ్రేయస్సు లభిస్తాయి. శనిని భయపడకుండా, ఆయనను గురువుగా, కర్మఫలదాతగా భావించి ఆరాధిస్తే మన జీవితంలో శాంతి, శ్రేయస్సు స్థిరమవుతుంది.