Sravana Masam | శ్రావ‌ణ మాసంలో ఈ ఐదు మొక్క‌లు నాటితే.. కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్త‌డం ఖాయం..!

Sravana Masam | మీరు అప్పుల పాల‌య్యారా..? ఆర్థికంగా కుదేల‌య్యారా..? అయితే ఈ శ్రావ‌ణ మాసం( Sravana Masam )లో ఈ ప‌రిహారం పాటిస్తే చాలు కోటీశ్వ‌రులై పోతారు. అదేంటంటే.. ఓ ఐదు మొక్క‌లు( Plants ) నాట‌డ‌మే.

Sravana Masam | శ్రావ‌ణ మాసం ( Sravana Masam ) అంటే ఆధ్యాత్మిక‌త‌( Spiritual )కు, భ‌క్తికి ప్ర‌తీక‌. ప్ర‌తి హిందూ మ‌హిళ( Hindu Woman ) శ్రావ‌ణ మాసంలో నిత్యం పూజ‌లు చేస్తుంటారు. ఆల‌యాల‌కు వెళ్లి త‌మ మొక్కులు చెల్లించుకుంటారు. ప్ర‌తి శ్రావ‌ణ శుక్ర‌వారం ప్ర‌త్యేక పూజ‌లు చేసి.. భ‌క్తిని చాటుకుంటుంటారు. అయితే ఈ శ్రావణంలో కొన్ని విశిష్టమైన మొక్కలను( Plants ) ఇంటి పరిసరాల్లో నాటడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ మొక్క‌లు ఇంట్లో శాంతిని, ఐశ్వ‌ర్యాన్ని, ఆధ్యాత్మిక శ‌క్తిని ఇస్తాయ‌ని, తద్వారా కోటీశ్వ‌రులు అయిపోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రి ఆ ఐదు మొక్క‌లు ఏంటో తెలుసుకుందాం..

తుల‌సి మొక్క‌

తుల‌సి మొక్క.. ఇది ప్ర‌తి ఇంటి ఆవ‌ర‌ణ‌లో క‌నిపిస్తుంది. ప్ర‌తి రోజు ఆ ఇంటి ఇల్లాలు తుల‌సి మొక్క‌కు పూజ‌లు చేస్తుంటారు. ల‌క్ష్మీదేవికి ఎంతో ఇష్ట‌మైన తుల‌సి మొక్క‌ను ఇంటి ఆవ‌ర‌ణ‌లో నాటి.. ప్ర‌తి రోజూ దీపారాధ‌న చేయ‌డంతో ఇంట్లో సానుకూల శ‌క్తి పెరిగి ధ‌న‌సంప‌త్తి వ‌స్తుంద‌ని న‌మ్మ‌కం. మొత్తంగా తుల‌సి మొక్క సాక్షిగా ల‌క్ష్మీ క‌టాక్షం సిద్ధిస్తుంది.

బిల్వ వృక్షం

శైవ సంప్ర‌దాయంలో బిల్వ వృక్షం అగ్ర‌స్థానంలో ఉంటుంది. బిల్వ ప‌త్రం అంటే శివుడికి ఎంతో ప్రీతి. ప‌ర‌మేశ్వ‌రుడికి బిల్వ‌దళంను స‌మ‌ర్పించ‌డంతో అపార పుణ్య‌ఫ‌లం ల‌భిస్తుంది. వాస్తు ప్ర‌కారం ఈ మొక్క‌ను ఇంటి ఆవ‌ర‌ణ‌లో నాటితే.. మ‌న‌కున్న దారిద్య్రం తొల‌గిపోయి, అష్టైశ్వ‌ర్యాలు ల‌భిస్తాయి.

శ‌మీ మొక్క‌

శ‌ని దేవుడికి, శివుడికి శ‌మీ మొక్క‌ను ప్రీతిక‌రంగా భావిస్తారు. ఎంతో ప‌విత్ర‌మైన శ్రావ‌ణ మాసంలో ఈ మొక్క‌ను నాట‌డంతో.. ఇంట్లో ప్ర‌తికూల శ‌క్తులు తొల‌గిపోయి, ఆధ్యాత్మిక రక్ష‌ణ ల‌భిస్తుంది. అంతేకాకుండా శ‌నిదోషం తొల‌గిపోయి.. సంప‌దలు స‌మ‌కూరుతాయ‌ని పండితులు చెబుతున్నారు.

తెల్ల జిల్లేడు మొక్క

శివుడితో అనుబంధం ఉన్న మరో ముఖ్యమైన మొక్క తెల్ల జిల్లేడు. ముఖ్యంగా తెల్ల పువ్వుల రకం అత్యంత పవిత్రంగా భావిస్తారు. తెల్ల జిల్లేడు పువ్వులను శివలింగానికి సమర్పించడం శుభ సూచకంగా భావించి.. కోరికలు నెరవేరే అవకాశముందని నమ్మకం. శ్రావణ సమయంలో తెల్ల జిల్లేడు మొక్కను ఇంట్లో నాటితే విజయం, ధనం, దైవ అనుగ్రహం కలుగుతాయంటారు.

ధతూరా మొక్క

తీక్షణంగా కనిపించే ధతూరా మొక్క శివునికి అత్యంత ప్రీతికరమైనది. దాని పూలు, పండ్లు శివలింగానికి సమర్పించడం అత్యంత పవిత్రమైన ఆచారంగా భావిస్తారు. ఇంట్లో ధతూరా మొక్కను నాటడం వల్ల దురదృష్టం తొలగిపోయి.. శత్రువుల మీద విజయం, సంపదలో వృద్ధి జరుగుతుందని నమ్మకం. ధతూరా శివయ్యకు అర్పించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి.