Vastu Tips | ప్రతి ఒక్కరూ వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకుంటారు. ఇంటీరియర్ కూడా వాస్తు నియమాల( Vatu Tips ) ప్రకారం ఏర్పాటు చేసుకుంటారు. అదే విధంగా దంపతులకు( Couples ) ఎంతో ప్రత్యేకమైన పడక గది( Bed Room )ని కూడా వాస్తు నియమాల ప్రకారం నిర్మించుకోవాల్సిందే. ఎందుకంటే.. ఆ పడక గది నుంచే జీవితమంతా సాగుతుంది. కాబట్టి బంధాలను బలోపేతం చేసే బెడ్రూంలో కొన్ని వస్తువులు ఉంచకూడదని వాస్తు నిపుణులు( Vastu Experts ) చెబుతున్నారు. అనవసరమైన వస్తువులను ఉంచడం వల్ల వాస్తు దోషాలు ఏర్పడి.. దంపతుల మధ్య కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుందని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు. మరి ఏయే వస్తువులు బెడ్రూంలో ఉంచకూడదో తెలుసుకుందాం..
- చాలా మంది పడక గదిలో దేవుళ్ల ఫొటోలు( God Photos ), విగ్రహాలు పెడుతుంటారు. ఇలా దేవుళ్ల ఫొటోలు బెడ్రూంలో పెట్టడ వల్ల తీవ్రమైన అపచారం చేసినట్లు అవుతుందట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పడక గదిలో దేవుళ్ల ఫొటోలను ఉంచకూడదు.
- ఆహ్లాదకరమైన వాతారవణం కోసం బెడ్రూంలో జలపాతాలకు, సముద్రాలకు చెందిన ఫొటోలు, పెయింటింగ్స్( paintings ) కూడా పెడుతుంటారు. ఈ ఫొటోల వల్ల కూడా దంపతుల మధ్య గొడవలు, కలహాలు ఏర్పడుతాయట. నెలల తరబడి మాటలు ఉండవట.
- చాలా మంది బెడ్రూంలో అద్దం ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఇది మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఉదయాన్నే లేచి అద్దం( Mirror )లో ముఖం చూసుకోకూడదట. ఇలా చేయడం వల్ల కూడా భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడుతాయట.
- ఇక పడక గదిని డార్క్ కలర్స్( Dark Colors )తో నింపేయొద్దని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. పాడైపోయిన ఎలక్ట్రానిక్ పరికరాలను మంచం కింద ఉంచకూడదట. దీని వల్ల ఆ ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ ప్రవేశించి, నిత్యం దంపతులు కొట్లాడుతారట. కాబట్టి భార్యాభర్తలు మంచిగా ఉండాలంటే బెడ్రూంలో వాస్తు నియమాలు తప్పక పాటించాల్సిందే.