Vastu Tips | ప్రతి ఒక్కరూ ఇంటిని వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మించుకుంటారు. కానీ చిన్నచిన్న విషయాల్లో పొరపాట్లు చేస్తుంటారు. అదేంటంటే.. దాంపత్య జీవితానికి( Couple Life ) సుఖసంతోషాలను అందించే పడక గది( Bed Room ) విషయంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు. అవసరం లేని చిత్రాలను వేలాడదీస్తుంటారు. ఆ చిత్రాల వల్ల దంపతుల మధ్య ఘర్షణలు తలెత్తి.. వైవాహిక జీవితం నిత్యం నరకంగా ఉంటుంది. ఇలాంటి వాస్తు దోషాలు( Vastu Dosham ) తొలగిపోవాలంటే.. బెడ్రూమ్‌లో ఉంచే చిత్రాల విషయంలో అత్యంత జాగ్రత్త పాటించాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు. దంపతుల మధ్య సుఖమయమైన జీవితం కొనసాగాలంటే హంసల( Swan ) జతతో కూడిన చిత్రాన్ని పడకగదిలో ఉండేలా చూసుకోవాలని వాస్తు పండితులు( Vastu Experts ) చెబుతున్నారు. మరి ఈ చిత్రపటాన్ని ఏ దిశలో ఉంచాలి..? దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
హంసల చిత్రం ఏ దిశలో ఉంటే మంచిది..?
చాలా మంది తమ పడకగదిలో పెళ్లి నాటి ఫొటోలు, పిల్లల ఫొటోలతో పాటు పూర్వీకుల ఫోటోలను ప్రదర్శిస్తుంటారు. ఇది సరికాదని పండితులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం పడకగదిలో హంసల జత ఉన్న చిత్రాన్ని వేలాడదీయాలని సూచిస్తున్నారు. ఈ ఫొటోను బెడ్రూం తూర్పు దిశలో ఉంచాలని చెబుతున్నారు. అలా చేయడం శుభప్రదమని భావిస్తున్నారు.
దంపతుల దాంపత్యం మరింత మధురం..!
హంసల జతతో కూడి చిత్రపటాన్ని పడకగదిలో ఏర్పాటు చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఈ చిత్రం వల్ల దంపతుల మధ్య నెలకొన్న కలహాలకు పరిష్కారం లభిస్తుంది. గొడవలకు స్వస్తి పలికి సంసార జీవితంలో మధురానుభూతులు పొందుతారు. గాఢమైన ప్రేమను బలోపేతం చేస్తుందని పండితులు పేర్కొంటున్నారు.
మరి ఆర్థిక లాభం ఉంటుందా..?
హంసల జతతో కూడిన చిత్రంతో ఆర్థిక లాభం ఉంటుందా..? అంటే ఉంటుందనే వాస్తు నిపుణులు చెబుతున్నారు. అయితే ఆర్థిక సమస్యలు తొలగిపోయి లాభాల పంట పండాలంటే.. డ్రాయింగ్ రూం లేదా గెస్ట్ రూమ్‌లో ఈ ఫొటోను వేలాడదీయాలని చెబుతున్నారు. ఇక నెగెటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది. వ్యాపారంలో పురోగతి సాధించి, విజయాల బాట పడుతారని పండితులు చెబుతున్నారు.
