Site icon vidhaatha

22.07.2024.. ఈ రాశివారికి కుటుంబంలో క‌ల‌హాలు..!

horoscope-

మేషం

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజంతా ఆధ్యాత్మికంగా కాలం గడుపుతారు. కొత్త ప్రాజెక్టులు, టెండర్లు పొందుతారు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. గతంలో చేసిన పొదుపును పెట్టుబడిగా మార్చడానికి ఇది మంచి సమయం. ఆరోగ్యం సహకరిస్తుంది.

వృషభం

ఎన్నో రోజులుగా కలలు కంటున్న విదేశీ ప్రాజెక్టులను చేజిక్కుంచుకుంటారు. కుటుంబ సభ్యులతో తీర్థ యాత్రలకు వెళతారు. శుభవార్త మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోండి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి.

మిథునం

మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వ్యాపారంలో నష్టాలను చూడాల్సి ఉంటుంది. వృత్తి పరంగా మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పై అధికారుల ప్రశంసలు పొందుతారు. కుటుంబ కలహాల కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ప్రమోషన్ రావడం వల్ల గృహంలో సంతోషం నెలకొంటుంది. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఆదాయం పెరుగుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది.

సింహం

ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. వృత్తి వ్యాపారాలలో సహోద్యోగుల సహకారం ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. పెద్దలతో వాదప్రతివాదాలు చేయకండి. ప్రతికూల ఆలోచనలు వీడండి. ఆంజనేయస్వామి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

కన్య

కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. కొత్తగా ఏ పని ఈ రోజు మొదలు పెట్టవద్దు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. కుటుంబంలో ఘర్షణ వాతావరణం ఉంటుంది. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి.

తుల

తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు. వైవాహిక జీవితంలో ఎదురయ్యే సమస్యలకు రాజీధోరణి ఉత్తమం. వ్యాపారులు ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. జల గండం ఉంది కాబట్టి నీటికి దూరంగా ఉండండి.

వృశ్చికం

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ సకాలంలో అన్ని పనులు పూర్తవుతాయి. చేసే పనుల్లో విజయ సూచన ఉంది. సన్నిహితుల సహకారం ఉంటుంది. అవసరానికి ధనం చేతికి అందుతుంది.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. అనవసరమైన కలహాలకు దూరంగా ఉండండి. సాహిత్యం పట్ల ఆసక్తితో ఉంటారు.

మకరం

ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల వారు చక్కని ప్రణాళికతో ముందుకెళ్తే విజయం ఉంటుంది. కుటుంబ వ్యవహారాల పట్ల వేచి చూసే ధోరణి అవలంబిస్తే మేలు. డబ్బు విపరీతగా ఖర్చవుతుంది.

కుంభం

ఈ రోజు అనుకూలంగా లేదు. సహనంతో ఉండాల్సిన సమయం. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండకపోతే మోసపోతారు. కుటుంబంలో కలహాలు ఉంటాయి. ప్రతికూల ఆలోచనలు వీడండి.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజంతా చాలా ఆనందంగా గడిచిపోతుంది. ఒత్తిడి, ఆందోళనల నుంచి బయట పడతారు. సన్నిహితులతో విహారయాత్రలకు వెళతారు. విందువినోదాలలో పాల్గొంటారు. ఆర్థికంగా అనుకూలం.

Exit mobile version