Trigrahi Yoga | చాలా మంది రాశిఫలాలను( Rashi Phalau ) నమ్ముతుంటారు. రాశిఫలాలను బట్టి తమ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. కొందరైతే రోజువారి రాశిఫలాలను చూసిన తర్వాతే పనులు మొదలు పెడుతారు. అంటే అంతగా విశ్వసిస్తారు రాశిఫలాలను. అయితే ఈ సెప్టెంబర్( September ) మాసంలో మూడు రాశుల వారికి రాజయోగం( Raja Yogam ) రాబోతోంది. ఆ మూడు రాశుల వారు తాము చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఎన్నో ఏండ్ల నుంచి వెంటాడుతున్న అడ్డంకులు కూడా తొలగిపోతాయి. ఊహించని విధంగా ఆర్థిక లాభాలు సాధించి, సిరుల పంట పండిస్తారు. మరి ఆ మూడు రాశులు ఏంటో తెలుసుకుందాం..
తుల (Libra)
కుజుడు – బుధుడు కలయిక తులా రాశివారికి శుభఫలితాలనిస్తోంది. ఈ సమయంలో న్యాయపరమైన వ్యవహారాల్లో తప్పకుండా విజయం సాధిస్తారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడుతారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఉద్యోగులు పదోన్నతులకు సంబంధించిన వార్తలు వింటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రేమికులు మరింత బలంగా ఉంటారు. అవివాహితులకు వివాహ యోగం ఉంటుంది.
ధనస్సు (Sagittarius)
మూడు గ్రహాల కలయిక ధనస్సు రాశివారికి ఊహించని ఆర్థిక లాభాన్నిస్తుంది. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యక్తిగతజీవితంలో ఉండే చికాకులు తొలగిపోతాయి. వ్యాపారులు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందుతారు.
కుంభం (Aquarius)
త్రిగ్రాహి యోగం కుంభ రాశివారికి మంచి ఫలితాలను ఇస్తుంది. ఊహించని విధంగా ఆర్థికలాభం పొందుతారు. ఎన్నో ఏండ్ల నుంచి వెంటాడుతున్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. స్టాక్ మార్కెట్, లాటరీల్లో పెట్టుబడి పెట్టినవారు తప్పకుండా లాభపడే అవకాశం ఉంది. కెరీర్‌లో అడుగు ముందుకు పడుతుంది. భాగస్వామ్య వ్యాపారంలో మంచి లభాలు పొందుతారు. కొన్ని వ్యవహారాల్లో రిస్క్ తీసుకుంటేనే శుభఫలితాలు పొందుతారు. ఉద్యోగులు, విద్యార్థులు శుభఫలితాలు పొందుతారు.