Indrakeeladri| రేపు ఇంద్రకీలాద్రికి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మూడోరోజు అమ్మవారు అన్నపూర్ణ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. రేపు గురువారం భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకోనున్నారు

అమరావతి : తెలుగురాష్ట్రాలలోని అమ్మవారి ఆలయాలలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు..అలంకార సేవలు ఘనంగా కొనసాగుతున్నాయి. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై(Indrakeeladri) కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో(Kanaka Durga Temple) దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మూడోరోజు అమ్మవారు అన్నపూర్ణ దేవి అలంకారంలో(Annapurna Devi Alankaram) భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. పెద్ద సంఖ్యలో అమ్మవారి కుంకుమార్చన పూజలలో పాల్గొంటున్నారు.

రేపు గురువారం భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఉప రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి వీఐపీ దర్శనాలు రద్దు చేశారు. అటు వరంగల్‌లో భద్రకాళి అమ్మవారు అలంకార సేవలో భాగంగా అన్నపూర్ణ దేవిగా దర్శనమిచ్చారు.