Vivaha Panchami | న‌వంబ‌ర్ 25న వివాహ పంచ‌మి.. ఆ రోజున ఇలా చేస్తే పెళ్లి పీట‌లెక్క‌డం ఖాయం..!

Vivaha Panchami |  పెళ్లి( Marriage ) వ‌యసొచ్చినా వివాహాలు కాని వారు ఎంద‌రో ఉన్నారు. వివాహం చేసుకుందామ‌న్నా ప్ర‌తిసారి ఏదో ర‌కంగా అడ్డంకులు ఏర్ప‌డుతుంటాయి. వివాహం విష‌యంలో ఆల‌స్యం అవుతున్నా.. అడ్డంకులు ఎదుర్కొంటున్న వారు.. వివాహ పంచ‌మి( Vivaha Panchami ) రోజున కొన్ని ప‌రిహారాలు చేయ‌డం వ‌ల్ల వీలైనంత త్వ‌ర‌గా పెళ్లి కుదిరి.. పెళ్లి పీట‌లెక్కే ఛాన్స్ ఉంద‌ట‌. మ‌రి వివాహ పంచమి ఏ రోజున వ‌స్తుంది..? ఆ రోజు ఎలాంటి ప‌రిహారాలు చేయాలో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం..

Vivaha Panchami | హిందూ మతం( Hindu Custom )లో వివాహ పంచమి అనేది చాలా పవిత్రమైన పండుగ‌. శ్రీరాముడు( Lord Srirama ), సీతాదేవిల వివాహ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా వివాహ పంచ‌మి( Vivaha Panchami ) వేడుక‌ను గొప్ప‌గా నిర్వ‌హిస్తారు. ఈ వివాహ పంచ‌మి మార్గశిర మాసం, శుక్ల పక్ష పంచమి తిథిలో వస్తుంది. వివాహం కాని వారు, వివాహం కోసం ప్రయత్నాలు చేసే వారు, తమ వివాహంలో అడ్డంకులు తొలిగించుకోవ‌డం కోసం వివాహ పంచమి రోజున ఈ ప‌రిహారాలు చేస్తే పెళ్లి పీట‌లెక్కే చాన్స్ ఉంద‌ట‌. అంతే కాకుండా వీరికి సీత, శ్రీరాముడు ఆశీర్వాదాలు లభిస్తాయంట. దీని వలన వైవాహిక జీవితం( Marriage Life ) అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మ‌రి వివాహ పంచ‌మి ఏ రోజున వ‌స్తుంది..? ఆ రోజు ఎలాంటి ప‌రిహారాలు చేయాలో ఈ క‌థ‌నంలో స‌మ‌గ్రంగా తెలుసుకుందాం..

వివాహ పంచ‌మి శుభ ముహుర్తం ఇదే..

ఈ ఏడాది నవంబ‌ర్ 25వ తేదీన వివాహ పంచ‌మి ఏర్ప‌డుతుంది. న‌వంబ‌ర్ 24 సోమ‌వారం రాత్రి 9.22 గంట‌ల‌కు పంచ‌మి తిథి ప్రారంభ‌మై.. 25వ తేదీ మంగ‌ళ‌వారం రాత్రి 10.56 గంట‌ల‌కు ముగుస్తుంది. ఈ రోజున ఉదయం 7:07 గంటల నుండి మధ్యాహ్నం 12:27 వరకు పూజకు అత్యంత శుభమైన సమయం.

వివాహ పంచ‌మి రోజున చేయాల్సిన ప‌రిహారాలు ఇవే..

ఉప‌వాస పూజ‌..

పెళ్లి కాని వారంద‌రూ వివాహ పంచ‌మి రోజున ఉప‌వాసం ఉంటే మంచిద‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఉప‌వాస దీక్ష‌లో ఉండి శ్రీరాముడు, సీతాదేవిని పూజిస్తే త్వ‌ర‌గా పెళ్లి అవుతుంద‌ట‌. అంతే కాకుండా ఈరోజు పవిత్ర వివాహ ఆచారాలకు సంబంధించిన మంత్రాలను జపించడం వలన వివాహంలో అడ్డంకులు తొలిగిపోయి, వైవాహిక జీవితం బాగుంటుందంట.

అర‌టి చెట్టుకు ప్ర‌త్యేక పూజ‌

ముఖ్యంగా అరటి చెట్టుకు పూజ చేయడం ఈ రోజు ప్రధాన ఆచారంగా ఉంది. తెల్లవారుజామున స్నానం చేసి పసుపు రంగు వస్త్రాలు ధరించి అరటి చెట్టుకు పసుపు తాడు కట్టి పూజ చేయడం శుభప్రదమని చెబుతున్నారు పండితులు. పూజ సమయంలో శ్రీరామ మంత్రాలు, విష్ణు మంత్రాలు జపించడం కూడా శ్రేయస్కరం అని పండితులు సూచిస్తున్నారు. పువ్వులు, చందనం సమర్పించి, నేతి దీపం వెలిగించి నైవేద్యం అర్పించడం ఆనవాయితీగా ఉంది.

అర‌టి చెట్టు చుట్టూ 21 ప్ర‌ద‌క్షిణ‌లు..

ఈ పర్వదినాన అవివాహితులు మంచి సంబంధం కోసం, వివాహితులు దాంపత్య జీవితం సుఖశాంతిగా ఉండాలని కోరుకుంటూ అరటి చెట్టు చుట్టూ 21 సార్లు ప్రదక్షిణలు చేయాల‌ట‌. ఈ విధంగా ఆరాధన చేసిన వారికి కోరికలు నెరవేరుతాయ‌ట‌. అరటి చెట్టుకు పూజ చేయడం వెనుక ఆధ్యాత్మిక అర్థం కూడా ఉంది. అరటి చెట్టు సంతాన సమృద్ధికి, దాంపత్య సమృద్ధికి ప్రతీకగా పరిగణిస్తారు. అందువల్ల వివాహ పంచమి రోజున ఈ ఆచారాన్ని భక్తులు ఎంతో భక్తి భావంతో పాటిస్తారు.

నల్ల నువ్వులు

వివాహంలో ఆలస్యం అవుతున్న వారు.. వివాహ పంచమి రోజున నల్ల నువ్వులను దానం చేయడం చాలా మంచిదట. దీని వలన శని దోషం తొలిగిపోయి, వివాహం కావ‌డానికి అవ‌కాశం ఉంద‌ట‌. అందుకే వివాహం అవ్వడంలో అడ్డంకులు ఎదురైతే, వారు నల్లనువ్వులు దానం చేయడం చాలా మంచిద‌ని పండితులు చెబుతున్నారు.

Latest News