Show for Cash | డబ్బులివ్వండి.. మా రాసలీలలు చూడండంటూ వీడియోలు విక్రయిస్తున్న దంపతులను అంబర్ పేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. డబ్బులిచ్చిన వారికి అశ్లీల వీడియోల స్ట్రీమింగ్ లింక్ లు, వీడియోలు పంపుతున్న ఏపీకి చెందిన దంపతులను అరెస్టు చేసి వారి నుంచి కెమెరాలు, లైవ్ లింక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అంబర్ పేట్ మల్లికార్జున నగర్ లో ఏపీకి చెందిన ఇద్దరు దంపతులు, తమ ఇద్దరు కూతుళ్లతో కలిసి నివాసం ఉంటున్నారు. డబ్బు సంపాదించేందుకు ఆ దంపతులు ఆన్ లైన్ లో అశ్లీల వీడియోలు అప్ లోడ్ చేసి..లైవ్ చాటింగ్ చేస్తే లక్షల్లో సంపాదించే అడ్డదారి మార్గం ఎంచుకున్నారు. ఇందుకోసం హై రిజల్యూషన్ కెమెరాలతో పాటు ఆన్ లైన్ లింకింగ్ సామాగ్రిని కూడా కొనుగోలు చేశారు. తాము నివసిస్తున్న ఇంటి టెర్రస్ పైనే పరదాలు కట్టి షూటింగ్ రూమ్ తయారు చేశారు. నిత్యం కెమెరా ఎదుట ఆ దంపతులు ఆ పనిలో పాల్గొని అనంతరం ఆ ఫుటేజ్ ని అశ్లీల వీడియోల యాప్ లో అప్లోడ్ చేసేవారు.
పదినిమిషాల నుంచి అరగంట వీడియోలను చూడాలంటే 500 నుంచి 2000 వరకు వారి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా చెల్లించే విధంగా వ్యాపారం మొదలు పెట్టారు. వీడియోల బిజినెస్ బాగానే ఉండటంతో.. లైవ్ లో చేస్తుండగా చూస్తారా అంటూ మరో బిజినెస్ కు తెరలేపారు. లైవ్ లో తమ రాసలీలలు చూడాలనుకునే వారి నుంచి రూ.1000 నుంచి 5000 వరకు డబ్బులు వసూలు చేసేవారు. స్వీటీ కపుల్ 2027పేరుతో వారు ముందుగా వాట్సాప్ లో అశ్లీల వీడియోలు చూస్తారా అంటూ చాట్ లు పెట్టి..డబ్బులిచ్చిన వారికి తమ క్రీడల వీడియోల లింక్ లు పెడుతు వస్తున్నారు. ఈ వీడియోల దందా క్రమంగా ఓ కానిస్టేబుల్ కు తెలిసింది. అదను చూసి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ దంపతుల ఇంటిపై దాడులు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు. లైవ్ చాట్ కు ఉపయోగించిన కెమెరాలు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఐటీ యాక్ట్ కింద కేసుల నమోదు చేశారు. వారి వెనుక ఏదైనా మాఫియా రాకెట్ ఉందా అన్న కోణంలోనూ విచారిస్తున్నారు.