Weekly Horoscope | ఈ వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి తోబుట్టువుల‌తో త‌గాదాలు..! ప్రేమ వ్య‌వ‌హారాల్లో మాధుర్యం..!!

Weekly Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని విశ్వసిస్తుంటారు. ఈ క్ర‌మంలో ప్ర‌తి రోజు, ప్ర‌తి వారం త‌మ రాశిఫ‌లాల‌కు అనుగుణంగా వ్య‌క్తులు త‌మ కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగిస్తుంటారు. మ‌రి ఈ వారం రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vidhaatha Weekly Horoscope

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు ఈ వారం గొప్ప అభ్యున్నతి ఉంటుంది. ఉన్నత పదవులు పొందుతారు. అధికార పరిధి విస్తరిస్తుంది. ఉద్యోగంలో గుర్తింపు, పదోన్నతి లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వ్యాపారులకు ఈ వారం మధ్యస్థంగా ఉంటుంది. సమిష్టి నిర్ణయాలకు ప్రాధాన్యం ఇస్తూ భాగస్వాములతో కలిసికట్టుగా పనిచేస్తే విజయం సిద్ధిస్తుంది. ఈ వారం ఆర్థిక స్థితిగతులు బాగుంటాయి. నూతన ఆదాయ మార్గాల ద్వారా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో కొంత ఒత్తిడి ఎదురవుతుంది. కుటుంబం వ్యవహారాల్లో ఆచి తూచి నడుచుకోవాలి. వైవాహిక జీవితంలో సమస్యలు రాకుండా జీవిత భాగస్వామితో సంయమనంతో వ్యవహరించాలి. ఆరోగ్యపరంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు అందుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా వ్యాపారులకు ఇది అద్భుతమైన సమయం. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనువైన సమయం. కీలక ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. ఉద్యోగులకు పని ప్రదేశంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి. అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఈ పరిచయాలు వృత్తిపరమైన ఎదుగుదలకు బాగా ఉపయోగపడతాయి. పదోన్నతులకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆర్థికంగా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రుణభారం తొలగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో స్పష్టత నెలకొంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ప్రయోజనాలు అందుకుంటారు. వ్యాపారులు చక్కగా రాణిస్తారు. పెట్టుబడులు, లాభాలు గణనీయంగా పెరుగుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు సాధిస్తారు. ఉద్యోగులకు కాలం అనుకూలంగా ఉంటుంది. పదోన్నతులు, జీతాల పెంపుకు సంబంధించిన శుభవార్తలు వింటారు. స్థానచలనం సూచన కూడా ఉంది. కొత్త పెట్టుబడులు పెట్టడం వలన ఆర్థిక పరిస్థితి మరింత మెరుగవుతుంది. ప్రేమ వ్యవహారాల్లో కొన్ని సవాళ్లు ఎదురు కావచ్చు. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది, దంపతుల మధ్య బంధం బలోపేతం అవుతుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు ప్రణాళికలు వేస్తారు.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. అయితే భాగస్వాములతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. పనిప్రదేశంలో సముచిత స్థానం లభించక నిరాశ చెందుతారు. ఆర్థికంగా సానుకూలత ఉంటుంది. అవసరానికి సరిపడా ధనం అందుబాటులో ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో నిజాయితీ ముఖ్యం. కుటుంబంలో ఘర్షణలు కలహాలు రాకుండా జాగ్రత్త వహించాలి. కుటుంబ పెద్దల పట్ల గౌరవభావంతో ఉండడం అవసరం. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది. విహారయాత్రలకు వెళ్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి అద్భుతంగా ఉంటుంది. స్థిరాస్తి రంగంలో కొనుగోళ్లు, అమ్మకాలు జోరందుకుంటాయి. అన్ని రకాల వ్యాపారాలు లాభాల బాటలో పయనిస్తాయి. వ్యాపారం విస్తరించి గొప్ప విజయాన్ని అందుకుంటారు. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. పదోన్నతులకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఐటీ, మెకానికల్, ఇంజనీరింగ్ రంగాల వారికి ఈ వారం అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా ధన ప్రవాహం బాగుంటుంది. వారసత్వపు ఆస్తుల ద్వారా ప్రయోజనం పొందుతారు. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలున్నా అవగాహనతో సర్దుకుంటాయి. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు.

కన్య (Virgo)

కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా మధ్యమ ఫలితాలు ఉండవచ్చు. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. కొత్త పనులు, కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ప్రారంభించిన పనుల్లో తరచూ ఆటంకాలు చికాకు పెడతాయి. అందరినీ కలుపుకుని ముందుకు పోవడం వల్ల ఆటంకాలు అధిగమించవచ్చు. అధికారులతో ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహించండి. ఆర్థికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చు. ఆదాయం బాగున్నప్పటికీ, దైనందిన ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో మోసపోకుండా ఆచి తూచి అడుగేయాలి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు ప్రణాళికలు వేస్తారు.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాల కోసం కృషి చేయాల్సి ఉంటుంది. వ్యాపారంలో ఒడిదుడుకులు ఉండవచ్చు. భాగస్వామ్య వ్యాపారాలలో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. వ్యాపారంలో నెలకొన్న పోటీ కారణంగా లాభాలు కూడా తగ్గవచ్చు. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. పట్టుదల, ఏకాగ్రతతో మంచి గుర్తింపు లభిస్తుంది. స్వస్థానప్రాప్తి ఉండవచ్చు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ప్రేమ బంధాల్లో అనవసర వాదనలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. జీవిత భాగస్వామితో ఘర్షణలకు దూరంగా ఉంటే మంచిది.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. వృత్తి పరంగా అనుకూలత ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారంలో విజయం కోసం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. చక్కని ప్రణాళికతో, ముందుచూపుతో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగులు పనిపట్ల శ్రద్ధ పెంచాలి. అనవసర విషయాల్లో, ఇతరుల వ్యవహారాల్లో తల దూర్చడం మంచిపని కాదు. ఆర్థికంగా బాగానే ఉన్నప్పటికీ కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున, ఆర్థిక సమస్యలు రాకుండా ఖర్చులు నియంత్రించుకోవాలి. ప్రేమ బంధాలు బలపడతాయి. వైవాహిక జీవితం అన్యోన్యంగా ఉంటుంది.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని ఊహించని సవాళ్లు ఎదురు కావచ్చు. పెట్టిన పెట్టుబడి కూడా నష్టపోయే ప్రమాదం ఉండవచ్చు. ప్రతి అడుగు ఆచి తూచి వేయాల్సి ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం లోపిస్తుంది. ఉద్యోగ మార్పు గురించి ఆలోచించే అవకాశం ఉంది. ఆర్థిక స్థితి స్థిరంగానే ఉన్నప్పటికీ డబ్బు రాకలో అడ్డంకులు ఉండవచ్చు. ప్రభుత్వం నుంచి రావలసిన బకాయిలు ఆలస్యం కావచ్చు. ప్రేమ వ్యవహారాల్లో విభేదాలు చోటుచేసుకోవచ్చు. వైవాహిక జీవితంలో సామరస్యం కోసం చేసే ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. తోబుట్టువులతో కూడా గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా శ్రమతో కూడిన ఫలితాలు ఉండవచ్చు. వ్యాపారంలో ధనయోగాలు ఉంటాయి. వ్యాపార విస్తరణకు అవసరమైన ధనం సమకూరుతుంది. ఉద్యోగంలో పనిఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎంత కష్టపడినా పనులు పూర్తి కాకపోవడంతో నిరాశ చెందుతారు. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. ప్రేమ వ్యహారాలు వివాహ బంధంతో బలపడతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ముఖ్యంగా వ్యాపారులు నూతన వ్యూహాలతో వ్యాపారాన్ని లాభాల బాటలో నడుపుతారు. ఇది వ్యాపార వృద్ధికి తోడ్పడుతుంది. ఉద్యోగంలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. గత కొంతకాలంగా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. తీర్థ యాత్రల నిమిత్తం అధిక ఖర్చులు ఉండవచ్చు. ప్రేమ వ్యహారాల్లో సర్దుబాటు ధోరణి అవసరం. కుటుంబంలో క్లిష్ట పరిస్థితులు ఉండవచ్చు. జీవిత భాగస్వామి సహకారంలో సమస్యలు అధిగమిస్తారు. గత కొంతకాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు అందుతాయి. ఉద్యోగ వ్యాపారంలో సమస్యలు తొలగుతాయి. వ్యాపారులకు శ్రేష్టమైన సమయం. పెట్టుబడులు, లాభాల రూపంలో ధనప్రవాహం ఉంటుంది. విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి. అధిక ఆదాయాలు అందుకుంటారు. వ్యాపార నిమిత్తం చేసే దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిప్రదేశంలో ఒత్తిడి తగ్గుతుంది. పదోన్నతులకు మార్గం సుగమం అవుతుంది. ఆర్థికంగా ఈ వారం చాలా యోగదాయకంగా ఉంటుంది. వివిధ మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో మాధుర్యం నెలకొంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో, కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్లి సంతోషంగా గడుపుతారు. వైవాహిక జీవితం హాయిగా సాగుతుంది.

Latest News