మేషం (Aries)
మేష రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగంలో క్రమశిక్షణ, సమయపాలనకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోవడం మంచిది. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు మరికొంత కాలం వేచి ఉండాలి. వ్యాపారులు తమ వ్యాపారాలపై అదనపు శ్రద్ధ వహించాలి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ఆశించిన లాభాల కోసం గట్టి కృషి, పట్టుదలతో పాటు ఓర్పు కూడా అవసరం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. రావలసిన బకాయిలు వసూలవుతాయి. జీవిత భాగస్వామితో వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. విద్యార్థులకు, ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. కృషికి తగిన ఫలితం తప్పకుండా ఉంటుంది.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన పనుల్లో విజయాలు సిద్ధిస్తాయి. గ్రహ సంచారం అనుకూలంగా ఉంది కాబట్టి అన్ని రంగాల వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఆకస్మిక ధనలాభాలకు అవకాశం ఉంది. ఉద్యోగులకు బాధ్యతలు పెరగడంతో పాటు పదోన్నతులకు కూడా ఉండవచ్చు. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాల్లో నిదానంగా నడుచుకోవాలి. వృథా ఖర్చులు నియంత్రిస్తే మంచిది. స్థిరాస్తి వ్యవహారాల్లో పెద్దల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో శుభవార్తలు వింటారు.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి మేలైన సమయం నడుస్తోంది. ఉద్యోగ వ్యాపారాలలో విజయ పరంపరలు కొనసాగుతాయి. ఉద్యోగులకు పదవీయోగంకు అవకాశం ఉంది. మీ మాటకు గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు గణనీయంగా పెరుగుతాయి. ఆర్థికంగా ఈ వారం ప్రయోజనకరంగా ఉంటుంది. పెట్టుబడుల నుంచి అంచనాలకు మించిన ధనలాభాలు ఆనందం కలిగిస్తాయి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో మొహమాటానికి పోవద్దు. కుటుంబ ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు ఆశాజనకంగా కొనసాగుతాయి. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు ఆనందం కలిగిస్తాయి. ఉద్యోగులు తమ ప్రతిభకు గుర్తింపు పొందుతారు. స్థానచలనం సూచన కూడా ఉంది. వ్యాపారులు భాగస్వామ్య వ్యాపారాలపై దృష్టి సారించాలి. సమిష్టి నిర్ణయాలకు ప్రాధాన్యత ఇస్తే వ్యాపారాల్లో సమస్యలను అధిగమించి లాభాలు అందుకుంటారు. ఆదాయం ఆశించిన మేరకు ఉంటుంది. సమాజంలో ప్రముఖుల నుంచి గౌరవాలు పొందుతారు. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు, నిరుద్యోగులు తమకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. గ్రహబలం అనుకూలంగా ఉన్నందున ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. హోదా పెరిగే అవకాశం కూడా ఉంది. వ్యాపారంలో గతంలోని సమస్యలు తొలగిపోతాయి. ఆదాయం, లాభాలు పెరుగుతాయి. బంధుమిత్రుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. అవివాహితులు పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. కుటుంబంలో సమస్యలు, జీవిత భాగస్వామితో అపార్ధాలు ఇబ్బంది పెడతాయి. ఖర్చులు నిలకడగా ఉంటాయి.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగంలో వృద్ధి గోచరిస్తోంది. పదోన్నతులకు అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు, నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఆదాయం పెరగడం, ఖర్చులు తగ్గడం ఆనందం కలిగిస్తుంది. సన్నిహితుల ద్వారా అదనపు ఆదాయ మార్గాలు సమకూరుతాయి. వ్యక్తిగత వ్యవహారాల్లో గోప్యత పాటించడం మంచిది. సంతానంకు సంబంధించి శుభవార్తలు వింటారు. విద్యార్థులకు ఈ వారం ఆశాజనకంగా ఉంటుంది.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. శ్రేష్టమైన సమయం నడుస్తోంది. ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది. నూతన ప్రాజెక్టులు, వెంచర్లు మొదలు పెట్టడానికి శుభ సమయం. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారుల అండదండలు ఉంటాయి. మీ ప్రతిభకు ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వ్యక్తిగత జీవితంలో కూడా పురోగతి వేగం పుంజుకుంటుంది. అవివాహితులు శుభవార్తలు వింటారు. కీలక వ్యవహారాల్లో మీ నిర్ణయానికి ప్రాధాన్యత పెరుగుతుంది. స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప విజయాలు సాధిస్తారు. ఆర్థికంగా గొప్ప శుభ సమయం. లక్ష్మీ కటాక్షంతో ఐశ్వర్యవంతులు అవుతారు. నిరుద్యోగుల కల నెరవేరుతుంది.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగులకు అధికార యోగం పట్టే అవకాశం ఉంది. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కొత్త విషయాలు నేర్చుకుంటారు. వ్యాపారులకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. లాభాలు, పెట్టుబడులు భారీగా పెరుగుతాయి. షేర్ మార్కెట్ పెట్టుబడుల నుంచి అధిక లాభాలు అందుకుంటారు. ఆదాయ వృద్ధికి సంబంధించిన ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. నిరుద్యోగులు, అవివాహితులు శుభవార్తలు వింటారు.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ఇంటా బయట వ్యతిరేక పరిస్థితులు ఉండవచ్చు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు అధికంగా ఉంటాయి. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. ఆశించిన ఫలితాలు కోసం శ్రమ తప్పదు. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు, నిరుద్యోగులు గట్టి ప్రయత్నాలు కొనసాగించాలి. వ్యాపారంలో పోటీ పెరుగుతుంది. కొన్ని సమస్యల పరిష్కారం కష్టతరం అవుతుంది. నష్టభయం కూడా ఉంది. ఆస్తి, ఆర్థిక లావాదేవీల్లో ఇతరుల మీద ఆధారపడకపోవడం శ్రేయస్కరం. ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం లోపిస్తుంది.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా సానుకూల పరిణామాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఉండవచ్చు. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. జీతం పెరుగుదల, స్వస్థాన ప్రాప్తి వంటి ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు, నిరుద్యోగులు ఆశించిన అవకాశాలు అందుకుంటారు. వ్యాపారంలో సమస్యల తగ్గుముఖం పడతాయి. పెట్టుబడులు, లాభాలు గణనీయంగా పెరుగుతాయి. వ్యాపార వృద్ధి గోచరిస్తోంది. కుటుంబ జీవితం సమస్యల వలయంగా మారుతుంది. జీవిత భాగస్వామితో, బంధువులతో విభేదాలు మనశ్శాంతిని దూరం చేస్తాయి. కొందరి ప్రవర్తన మనస్థాపం కలిగిస్తుంది.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు పదోన్నతులతో పాటు ఉద్యోగ స్థిరత్వం కూడా లభిస్తుంది. స్థానచలనం కూడా ఉండవచ్చు. వ్యాపారంలో రాబడి పెరగడం, ఖర్చులు తగ్గడం శుభ పరిణామం. ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది. ఆస్తిని వృద్హి చేయడానికి, స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టడానికి అనువైన సమయం. బంధు మిత్రులతో కలిసి శుభకార్యాల్లో సంతోషంగా గడుపుతారు. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ పని ఒత్తిడి పెరుగుతాయి. ఆశించిన ఫలితాలు ఆలస్యం కావచ్చు. సహనం కోల్పోవద్దు. వ్యాపారులు కొన్ని కఠిన నిర్ణయాలతో ముందుకెళ్తే లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించవు. ముందుచూపుతో ఆర్థిక సమస్యలు అధిగమించవచ్చు. కీలక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలతో నష్టం వాటిల్లుతుంది. బంధు మిత్రులతో తొందరపడి మాట్లాడడం అపార్ధాలకు దారితీస్తుంది. వృధా ఖర్చులు నివారించండి.
