మేషం (Aries)
మేషరాశి వారికి ఈ వారం శుభకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఆశించిన పదోన్నతులు, బదిలీలు అందుకుంటారు. పెట్టుబడులు, లాభాలు గణనీయంగా పెరుగుతాయి. మీరు ఇతర సంస్థలలో, షేర్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడుల నుంచి కూడా మంచి లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో తీర్థయాత్రలకు వెళ్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రేమికుల మధ్య సమన్వయం ఉంటుంది.
వృషభం (Taurus)
వృషభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. భాగస్వామ్య వ్యాపారాలలో సమిష్టి నిర్ణయాలకు ప్రాధాన్యత ఇస్తే మంచిది. ఉద్యోగులు తమ పైఅధికారులతో జాగ్రత్తగా మెలగాలి. పనిఒత్తిడి, శ్రమ పెరగకుండా చూసుకోండి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఖర్చులు పెరిగినా డబ్బు సర్దుబాటు అవుతుంది. కుటుంబంలోని చిన్న చిన్న సమస్యలను బుద్ధిబలంతో పరిష్కరిస్తారు. ఆస్తి వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రేమికుల మధ్య సమస్యలు తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో ఆనందం నెలకొంటుంది.
మిథునం (Gemini)
మిథునరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో పురోగతి సంతృప్తి కలిగిస్తుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన ప్రయోజనాలు అందుకుంటారు. నూతన ఆదాయ వనరులు పెరుగుతాయి. పూర్వీకుల ఆస్తులు కలిసి వస్తాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కుటుంబంతో శుభకార్యాల్లో, వేడుకల్లో పాల్గొంటారు. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు. విద్యార్థులకు ఈ వారం కఠిన శ్రమతోనే విజయం సిద్ధిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.
కర్కాటకం (Cancer)
కర్కాటకరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు సహోద్యోగుల సహాయ సహకారాలు ఉంటాయి. పదోన్నతుల కోసం చేసే కృషి ఫలిస్తుంది. స్థానచలనం సూచన కూడా ఉంది. ముఖ్యమైన పనుల్లో జాప్యం చోటు చేసుకోవచ్చు. సహనంతో ఉండడం అవసరం. కెరీర్ పరంగా, ఉద్యోగ మార్పు కోరుకునే వారు మరికొంత కాలం వేచి ఉంటే మంచిది. ప్రేమికులు పెద్దల ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తే మంచిది. జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆర్థికంగా మంచి లాభాలు ఉండవచ్చు.
సింహం (Leo)
సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఆశించిన ఫలితాలు ఆలస్యం కావచ్చు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నాలు చేసే వారు మంచి అవకాశాలు అందుకుంటారు. వ్యాపారులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులు ఆశించిన లాభాలు అందిస్తాయి. స్థిరాస్తి, షేర్ మార్కెట్ రంగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఏర్పడవచ్చు. జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పర్థలు విచారం కలిగిస్తాయి. కుటుంబ కలహాలు రాకుండా జాగ్రత్త వహించండి. రాజీధోరణి అవలంబిస్తే మంచిది.
కన్య (Virgo)
కన్యారాశి వారికి ఈ వారం ఆనందదాయకంగా గడిచిపోతుంది. స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప విజయాలు సాధిస్తారు. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. మీ కృషిని ఉన్నతాధికారులు గుర్తిస్తారు. పదోన్నతులకు అవకాశం ఉంది. వ్యాపారులకు నూతన ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థికంగా, ఈ వారం అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. ఖర్చులు కూడా అదుపులోనే ఉంటాయి. గతంలో రావలసిన డబ్బు ఇప్పుడు చేతికి అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు రాకుండా జాగ్రత్త వహించాలి. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది. ఆర్థిక క్రమ శిక్షణ, సానుకూల దృక్పధంతో ఖచ్చితమైన విజయాలు సాధించవచ్చు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు.
తుల (Libra)
తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఆటంకాలు అధిగమిస్తారు. ఆశించిన ఫలితాల కోసం కొంత శ్రమ తప్పదు. ఉద్యోగంలో ఒత్తిడి దరిచేరకుండా జాగ్రత్త పడండి. ముఖ్యమైన పనులు వాయిదా వేయవద్దు. వ్యాపారులు వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక సమస్యలు ఉత్పన్నం కాకుండా ఖర్చులు నివారించండి. పెట్టుబడుల విషయంలో తెలివిగా వ్యవహరించండి. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు తలెత్తవచ్చు. కుటుంబంలో చిన్న చిన్న కలహాలు పెరగకుండా చూసుకోండి. పెద్దల మాటలకు విలువ ఇవ్వడం వలన మంచి జరుగుతుంది.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో సవాళ్ళను సమర్ధవంతంగా అధిగమిస్తారు. గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందున చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. పదవీయోగం ఉంది. వ్యాపారులు వ్యూహాత్మకంగా నడుచుకోవడం వలన లాభాలు పెరుగుతాయి. ఆర్థికంగా నూతన ఆదాయ వనరులను ఏర్పాటు చేసుకుంటారు. పలు మార్గాల నుంచి ధనాదాయం ఉంటుంది. భూ, గృహ వాహన యోగాలున్నాయి. స్థిరాస్తిలో పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ప్రేమికుల మధ్య అపోహలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సురాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. కొత్త పెట్టుబడులు పెట్టటానికి, వ్యాపారాన్ని వృద్ధి చేసుకోడానికి అనువైన సమయం. ఆస్తులను వృద్ధి చేయడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులు ఉన్నతాధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. సహచరులతో వృత్తి పరమైన విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. ప్రేమ జీవితంలో, కొన్ని సవాళ్లు ఉండవచ్చు. కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. రుణభారం తగ్గడం, ఆదాయం పెరగడం సంతృప్తిని ఇస్తుంది.
మకరం (Capricorn)
మకరరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా గొప్ప అవకాశాన్ని అందుకుంటారు. దీనితో ఆర్థికస్థితి మెరుగవుతుంది. ఉద్యోగస్తులు విజయం సాధించాలంటే అదనపు కృషి చేయాల్సి ఉంటుంది. ప్రేమ సంబంధాల్లో స్థిరత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వైవాహిక జీవితంలో కొంత ఒత్తిడి ఉండవచ్చు కాబట్టి అవగాహన, సహనంతో ముందుకు సాగాలి. జీవిత భాగస్వామితో అపార్ధాలు ఏర్పడకుండా జాగ్రత్త వహించండి. ఆర్థిక పరంగా స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది.
కుంభం (Aquarius)
కుంభరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో వృత్తిపరమైన ఆటంకాలు అధిగమిస్తారు. కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో విజయం సాధిస్తారు. వ్యాపారులు చక్కని ప్రణాళికతో మంచి లాభాలను గడిస్తారు. పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సలహాలు తప్పనిసరి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఇంటికి బంధువులు రావడంతో ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులు సకాలంలో అన్ని పనులు పూర్తిచేసి, ప్రశంసలు అందుకుంటారు. పదోన్నతులు, ఆర్థిక లాభాలు ఉంటాయి. పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు శుభవార్తలు అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది.
మీనం (Pisces)
మీనరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో ఆచి తూచి నడుచుకోవాలి. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు అందరినీ సంప్రదించడం మంచిది. ఉద్యోగులు ఉన్నతాధికారుల సలహా మేరకు నడుచుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు కొత్త ప్రాజెక్టుల విషయంలో ప్రణాళికతో ముందుకెళ్తే ఆశించిన ఫలితాలు పొందవచ్చు. రుణాలు, పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక భారం కలగకుండా ఖర్చులు అదుపు చేయండి. కొన్ని ప్రణాళిక లేని ఖర్చులు భారంగా మారవచ్చు. కుటుంబ సంబంధాలలో ఒత్తిడి ఉండవచ్చు. జీవిత భాగస్వామి నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది.