మేష రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. ఆశించిన పదోన్నతులు అందుకుంటారు. వ్యాపారంలో శ్రద్ధ, ఏకాగ్రత పెంచాలి. పెట్టుబడుల మీద దృష్టి సారిస్తే మంచిది. భాగస్వామ్య వ్యాపారాలు మెరుగ్గా ఉంటాయి. లాభాలు గణనీయంగా పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలు అవగాహనతో సర్దుకుంటాయి. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.
వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు ఈ వారం కలిసి వస్తుంది. చక్కని ప్రణాళికతో, సమయపాలనతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ప్రణాళిక చాలా అవసరం. భవిష్యత్ అవసరాల కోసం పొదుపు మార్గాలపై దృష్టి సారిస్తారు. ముందుచూపుతో వ్యవహరిస్తే ఖర్చులు తగ్గుతాయి. కుటుంబంలో కొంత అలజడి ఉండవచ్చు. జీవిత భాగస్వామితో కలహాలు రాకుండా జాగ్రత్త వహించండి.
మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు కెరీర్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. నిరుద్యోగులు, ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు శుభవార్తలు వింటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి శుభ సమయం. వ్యాపారాన్ని నలువైపులకు విస్తరిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించండి. పెట్టుబడుల విషయంలో ఆచి తూచి నడుచుకోవాలి. ఎవరికీ అప్పులు ఇవ్వద్దు. అనవసర చర్చలు, వివాదాలకు దూరంగా ఉండండి.
కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు తమ తమ వృత్తిలో కొత్త అవకాశాలు అందుకుంటారు. ఉద్యోగులు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. స్వస్థానప్రాప్తి ఉంది. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారు మంచి అవకాశాలు అందుకుంటారు. స్థిరాస్తి పెట్టుబడులకు అనువైన సమయం. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు. ముందుచూపుతో ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు.
సింహ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. చిత్తశుద్ధి, పట్టుదలతో పనిచేస్తే విజయాలు సిద్ధిస్తాయి. ఉద్యోగులు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే లక్ష్యాలను చేరుకోవచ్చు. వృత్తి పరమైన ఒత్తిడి ఉన్నప్పటికీ సమయస్ఫూర్తితో ముందుకు సాగితే ఒత్తిడిని అధిగమించవచ్చు. ఆర్థికంగా పటిష్టమైన ప్రణాళిక అవసరం. అనవసర ఖర్చులు పెరగకుండా నివారించండి. కుటుంబ వ్యవహారాల్లో సహనంతో నడుచుకోవాలి. జీవిత భాగస్వామితో తీర్థయాత్రలకు వెళ్తారు.
కన్యా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. గత కొంతకాలంగా ఇబ్బంది పెట్టిన సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులు, బదిలీ వంటి ప్రయోజనాలు పొందుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. అదనపు ఆదాయ వనరులు సమకూరుతాయి. సంపద వృద్ధి చెందుతుంది. బుద్ధిబలంతో కుటుంబ సమస్యలను పరిష్కరిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
తులా రాశి వారికి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో అప్రమత్తంగా ఉండడం అవసరం. వ్యాపారంలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు స్థానచలనం సూచన ఉంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. రుణభారం, ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామితో అనవసర కలహాలు, వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. కొన్ని అనుకోని ప్రయాణాలు ఉండవచ్చు. విద్యార్థులు కష్టపడితే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించగలరు.
వృశ్చిక రాశి వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్న సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగంలో నైపుణ్యాలు పెరగడంతో మంచి గుర్తింపు సాధిస్తారు. వ్యాపారంలో ఆటంకాలు తొలగడంతో అభివృద్ధి సాధిస్తారు. శుక్రగ్రహం అనుకూలతతో విశేషమైన ధనలాభాలు ఉంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచన ఉంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. విద్యార్థులు ఆశించిన విజయాలు అందుకుంటారు.
ధనుస్సు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆశించిన ప్రయోజనాల కోసం తీవ్ర కృషి అవసరం. చేపట్టిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. వ్యాపారులు ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటే లాభాలు పెరుగుతాయి. నూతన ఆదాయ వనరులపై దృష్టి సారిస్తారు. అధికారులతో జాగ్రత్తగా నడుచుకోవాలి. ఆర్థిక సంబంధిత విషయాలలో ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవడం మేలు. తొందరపాటు నిర్ణయాలతో నష్టం కలుగుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు న్యాయపరమైన సలహాలు తీసుకోండి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి.
మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. శుభకాలం నడుస్తోంది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. బుద్ధిబలంతో ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడిని అధిగమిస్తారు. కీలక విషయాల్లో ఏమరుపాటు తగదు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. నూతన వాహన యోగం, గృహ యోగాలు ఉన్నాయి. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఖర్చుల విషయంలో తెలివిగా వ్యవహరించాలి.
కుంభ రాశి వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగంలో శుభ యోగాలున్నాయి. ప్రారంభించిన పనుల్లో చిన్నపాటి సమస్యలు ఎదురైనా ఉన్నతాధికారుల మద్దతు, సహోద్యోగుల సహకారంతో అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఒక వ్యవహారంలో మీ వాగ్ధాటికి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. గతంలో నష్టపోయిన డబ్బును కూడా తిరిగి పొందుతారు. కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టండి.
మీన రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగంలో పనిభారం, బాధ్యతలు పెరుగుతాయి. కర్తవ్య నిర్వహణ కోసం తీవ్రంగా శ్రమిస్తారు. లక్ష్య సాధనలో కొన్ని ఇబ్బందులు తప్పవు. ఒక వ్యవహారంలో నిందలు పడాల్సి వస్తుంది. వ్యాపారులు ఈ వారం స్థిరమైన వృద్ధిని ఆశించవచ్చు. ముఖ్యంగా కొత్త ఒప్పందాలు, వ్యాపార విస్తరణకు మెరుగైన అవకాశాలు ఉంటాయి. ఆర్థిక సమస్యలు తలెత్తకుండా ఖర్చులు అదుపు చేయడం అవసరం. విద్యార్థులు విజయం సాధించాలంటే పట్టుదల, ఏకాగ్రత అవసరం. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి.