Site icon vidhaatha

Vastu Tips | ప‌డ‌క‌, స్నానాల గ‌దిలో అద్దం ఏ దిశ‌లో ఉంటే మంచిది..? మ‌రి వంట గ‌దిలో ఉండొచ్చా..?

Vastu Tips | ప్ర‌స్తుతం ప్ర‌తి ఒక్క‌రూ వాస్తు( Vastu ) ప్ర‌కారం ఇల్లును నిర్మించుకుంటున్నారు. వాస్తు ప్ర‌కారం ఇంటిని నిర్మించుకున్న‌ప్ప‌టికీ.. ఇంట్లో ఉంచే వస్తువుల‌కు కూడా వాస్తు నియ‌మాలు పాటించాల‌ని వాస్తు శాస్త్ర నిపుణులు( Vastu Experts ) హెచ్చ‌రిస్తున్నారు. మ‌రి ముఖ్యంగా మ‌నం నిత్యం చూసుకునే అద్దం( Mirror ) ఉంచే విష‌యంలో వాస్తు నియ‌మాలు పాటించ‌క‌పోతే ప్ర‌మాదం కొని తెచ్చుకున్న‌ట్టే అని చెబుతున్నారు. ప‌డ‌క‌( Bed Room ), స్నానాల గది( Bath Room )లో ఏ దిశ‌లో అద్దం ఏర్పాటు చేసుకుంటే మంచిది..? వంట గ‌ది( Kitchen )లో అద్దం ఉండొచ్చా..? అనే విష‌యాల‌ను తెలుసుకుందాం..

ప్ర‌తి ఇంట్లోనూ ప‌డ‌క గ‌ది( Bed Room )లో అద్దం ఉంటుంది. కొంద‌రు హాల్‌లో కూడా అద్దం ఏర్పాటు చేసుకుంటారు. ఇంకొంద‌రు స్నానాల గ‌దిలో కూడా అద్దం ఉంచుతారు. అయితే ప‌డ‌క‌, స్నానాల గ‌దిలో అద్దం ఏర్పాటు చేసుకునే విష‌యంలో వాస్తు నియ‌మాలు త‌ప్ప‌క పాటించాలి. ఈ రెండు గ‌దుల్లో తూర్పు లేదా ఉత్త‌ర దిశ‌లో ఉండే గోడ‌కు అద్దాల‌ను బిగించుకోవాల‌ని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. దీని వ‌ల్ల ఇంట్లో పాజిటివ్ ఎన‌ర్జీతో పాటు అదృష్టం క‌లిసి వ‌స్తుంద‌ని చెబుతున్నారు.

కొంత‌మంది తెలియ‌క వంట గ‌దిలోనూ అద్దాల‌ను బిగించుకుంటారు. వంట గ‌దిలో అద్దాల‌ను ఉంచ‌డం స‌రికాద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. వంట గ‌దిలో అద్దం బిగించుకోవ‌డంలో ఆ ఇంట్లో నెగిటివ్ ఎన‌ర్జీ ఏర్ప‌డి, కుటుంబ క‌ల‌హాలకు దారి తీసే అవ‌కాశం ఉంటుంద‌ని వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

ఇక టీవీలు, కంప్యూటర్లు.. ఇంట్లోని స్టడీ, లివింగ్ రూమ్​లో ఆగ్నేయ మూలలో ఉండేలా చూసుకోవాలని పండితులు చెబుతున్నారు. అయితే, ఈశాన్యం, నైరుతి దిక్కులో మాత్రం ఇవి ఉండకూడదని చెబుతున్నారు.

అపార్ట్​మెంట్, ఇండిపెండెంట్ హోమ్ ఇలా ఎలాంటి ఇంట్లో ఉంటున్నా సరే.. మెయిన్ ఎంట్రన్స్​కు ఎదురుగా లిఫ్ట్​ ఉండకూడదని.. ఇలా ఉండడం వల్ల అదృష్టం కలిసిరాదని చెబుతున్నారు.

Exit mobile version