Ganesh Pooja | హిందూ సంప్రదాయం( Hindu Custom )లో ప్రతి రోజు ఒక దేవుడి( God )ని పూజిస్తారు. ఇక బుధవారం( Wednesday ) వచ్చిందంటే చాలు.. విఘ్నేశ్వరుడికి( Lord Ganesh ) ప్రత్యేక పూజలు చేస్తారు. వీలైన వారు గణేశ్ ఆలయాలకు( Ganesh Temples ) వెళ్తుంటారు. వీలు కాని పక్షంలో ఇంట్లోనే గణనాథుడికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. బుధవారం లంబోదరుడిని పూజించడం వల్ల ఆ ఇంట్లో ఉన్న దారిద్య్రం తొలగిపోతుందట.
హిందువుల నివాసాల్లో ఎలాంటి శుభకార్యం జరిగినా ముందుగా వినాయకుడినే పూజిస్తారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన గణనాథుడికి బుధవారం ఎలా పూజలు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బుధవారం నాడు గణనాథుడిని పూజించడం వల్ల ఆ ఇంట్లో ఉన్న కష్టాలు, రోగాలు, దారిద్య్రం తొలగిపోయి అష్టైశ్వర్యాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. ఏక దంతుడికి ఎరుపు రంగు అంటే ఎంతో ఇష్టం కాబట్టి.. గణేశుడిని ఆరాధించే సమయంలో ఎర్రటి కుంకుమను తిలకంగా దిద్దండి. ఆరాధించే సమయంలో తప్పనిసరిగా గడ్డిని సమర్పిస్తూ ఉండాలి. ఇలా గడ్డిని సమర్పించడం వల్ల వినాయకుడు సంతోషిస్తాడు.
వినాయకుడికి శమీ మొక్కల్ని సమర్పించడం వల్ల కూడా అన్ని పనులు సవ్యంగా సాగుతాయని చెబుతున్నారు. ఇలా చేయడం వలన ఆ ఇంట్లో సుఖం, సంతోషం వెల్లివిరుస్తాయి. అష్టైశ్వర్యాలు కలుగుతాయి.
పూజలో అక్షింతలను పవిత్రంగా భావిస్తారు. పూజ చేస్తూ వినాయకుడి మీద అక్షింతలు చల్లుతూ ఆరాధించాలి. ఇక చివరకు బెల్లంను నైవేద్యంగా పెట్టడం వల్ల గణనాథుడి కరుణా కటాక్షం ఆ ఇంటిపై ఉంటుంది.. ప్రతి బుధవారం ఇలా చేయడం వల్ల ఎన్నో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని అర్చకులు చెబుతున్నారు.