ESE – 2025 | ప్రతి ఏడాది ఇంజినీరింగ్( Engineering ) పట్టభద్రులు వేల సంఖ్యలో పట్టాలను పుచ్చుకుంటారు. ఇందులో 70 శాతం మంది ప్రయివేటు సెక్టార్‌లో స్థిరపడేందుకు ఇష్టపడుతుంటారు. మిగిలిన 30 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగాలు( Govt Job ) సాధించేందుకు మొగ్గు చూపుతుంటారు. ఇక విడుదలైన ప్రతి నోటిఫికేషన్( Notification )కు పోటీ పడుతుంటారు. అయితే కేంద్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఇంజినీరింగ్ పోస్టుల( Engineering Jobs ) భర్తీకి ప్రతి ఏడాది నిర్వహించే ఈఎస్ఈ-2025( ESE – 2025 ) నోటిఫికేషన్ విడుదలైంది. 457 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో ఇంజినీరింగ్ అభ్యర్థులు( Engineering Graduates ) పరీక్షలకు సిద్ధమైపోతున్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే( Railway ), టెలికం( Telecom ), డిఫెన్స్( Defense ) సర్వీస్ తదితర కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( UPSC ) ఏటా ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ( Engineering Services Exam ) నిర్వహిస్తుంది.
విభాగాలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్
విద్యార్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిప్లొమా, బీఈ/బీటెక్‌లో సంబంధిత బ్రాంచీలో ఉత్తీర్ణులై ఉండాలి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
వయస్సు: 2025, జనవరి 1 నాటికి 21 – 30 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం
స్టేజ్-1 ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్ టైప్ పేపర్స్), స్టేజ్-2 (మెయిన్) ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్ట్, వైద్యపరీక్షలు, సర్టిఫికెట్ల పరిశీలన ద్వారా ఎంపిక చేస్తారు.
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (స్టేజ్-1)
పేపర్-1 (జనరల్ స్టడీస్ అండ్ ఇంజినీరింగ్ ఆప్టిట్యూడ్)- 200 మార్కులు
పేపర్-2 (సంబంధిత ఇంజినీరింగ్ బ్రాంచీ సబ్జెక్టు నుంచి)- 300 మార్కులు.
మొత్తం 500 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. దీనిలో అర్హత సాధించిన వారికి మెయిన్/స్టేజ్-2 పరీక్ష నిర్వహిస్తారు.
మెయిన్/స్టేజ్-2 పరీక్ష
పేపర్-1 (సంబంధిత సబ్జెక్టు)-300,
పేపర్-2 (సంబంధిత సబ్జెక్టు)-300 ప్రశ్నలు ఇస్తారు.
మొత్తం 600 మార్కులకు పరీక్ష ఉంటుంది.
పరీక్ష కాల్యవవధి
పేపర్-1 – 3 గంటలు,
పేపర్-2 – 3 గంటలు
స్టేజ్-3 (పర్సనాలిటీ టెస్ట్)
200 మార్కులకు పర్సనాలిటీ టెస్ట్‌ను నిర్వహిస్తారు.
పోస్టులు ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ శాఖలు
సివిల్ ఇంజినీరింగ్
సెంట్రల్ ఇంజినీరింగ్ సర్వీస్, సర్వే ఆఫ్ ఇండియా, బీఆర్‌వో, ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ ఆఫ్ ఇంజినీరింగ్, ఎంఈఎస్ సర్వేయర్ కేడర్, ఇండియన్ స్కిల్ డెవలప్‌మెంట్ సర్వీస్, సెంట్రల్ వాటర్ ఇంజినీరింగ్ సర్వీస్
మెకానికల్ ఇంజినీరింగ్
ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ ఆఫ్ ఇంజినీర్స్, ఇండియన్ నేవల్ ఆర్మమెంట్ సర్వీస్, సెంట్రల్ పవర్ ఇంజినీరింగ్ సర్వీస్, డిఫెన్స్ ఏరోనాటికల్ క్వాలిటీ అస్యూరెన్స్ సర్వీస్, బీఆర్‌వో, ఇండియన్ నేవల్ మెటీరియల్ మేనేజ్‌మెంట్ సర్వీస్, ఇండియన్ స్కిల్
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్
ఐఈడీఎస్, సెంట్రల్ పవర్ ఇంజినీరింగ్, ఇండియన్ నేవల్ ఆర్మమెంట్ సర్వీస్, ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ ఆఫ్ ఇంజినీర్ తదితరాలు
ఈసీఈ
ఇండియన్ టెలీకమ్యూనికేషన్ సర్వీస్, సెంట్రల్ పవర్ ఇంజినీరింగ్ సర్వీస్, డిఫెన్స్ ఏరోనాటికల్ క్వాలిటీ అస్యూరెన్స్ సర్వీస్, ఇండియన్ స్కిల్ డెవలప్‌మెంట్ సర్వీస్, ఇండియన్ రేడియో రెగ్యులేటరీ సర్వీస్ తదితరాలు
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: నవంబర్ 22
ప్రిలిమినరీ/స్టేజ్-1 టెస్ట్ పరీక్షతేదీ: 2025, ఫిబ్రవరి 9
వెబ్‌సైట్: https://upsc.gov.in