Grace Marks | నీట్‌ పరీక్షలో ఆ అభ్యర్థుల గ్రేస్‌ మార్కులను రద్దు చేస్తాం : కేంద్ర ప్రభుత్వం

Grace Marks | నీట్‌ పరీక్షలో 1,563 మంది అభ్యర్థులకు 'నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ (NTA)' ఇచ్చిన మార్కులను రద్దు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. నీట్‌ రాసిన 1,563 మంది అభ్యర్థులకు ఎన్‌టీఏ ఇచ్చిన గ్రేస్‌ మార్కులను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై ఇవాళ జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ విచారణ చేపట్టింది. కొన్ని కేంద్రాల్లో పరీక్ష ఆలస్యం కారణంగా సమయ నష్టాన్ని భర్తీ చేసేందుకు 1,563 మంది అభ్యర్థులకు ఎన్‌టీఏ గ్రేస్‌ మార్కులు ఇచ్చింది.

  • Publish Date - June 13, 2024 / 02:32 PM IST

Grace Marks : నీట్‌ పరీక్షలో 1,563 మంది అభ్యర్థులకు ‘నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ (NTA)’ ఇచ్చిన మార్కులను రద్దు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. నీట్‌ రాసిన 1,563 మంది అభ్యర్థులకు ఎన్‌టీఏ ఇచ్చిన గ్రేస్‌ మార్కులను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై ఇవాళ జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ విచారణ చేపట్టింది. కొన్ని కేంద్రాల్లో పరీక్ష ఆలస్యం కారణంగా సమయ నష్టాన్ని భర్తీ చేసేందుకు 1,563 మంది అభ్యర్థులకు ఎన్‌టీఏ గ్రేస్‌ మార్కులు ఇచ్చింది.

దాంతో కొంతమంది అభ్యర్థులకు 720 మార్కులకుగాను 718, 719 మార్కులు కూడా వచ్చాయి. వాస్తవానికి నీట్‌ పరీక్షలో 180 ప్రశ్నలకు ఒక్కో సమాధానానికి నాలుగేసి మార్కుల చొప్పున 720 మార్కులు ఉంటాయి. అన్ని్ ప్రశ్నలకు సరైన సమాధానం ఇచ్చిన అభ్యర్థికి 720 మార్కులు వస్తాయి. అందులో ఒక ప్రశ్నకు తప్పుడు సమాధానం రాస్తే 716 మార్కులు వస్తాయి. కానీ 717, 718, 719 మార్కులు వచ్చే ఛాన్స్‌ లేదు. కానీ ఈసారి పరీక్షలో కొందరికి 718, 719 మార్కులు వచ్చాయి. దాంతో పరీక్షల్లో అవకతవకాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ క్రమంలో అవకతవకలు జరగలేదని, పరీక్ష ఆలస్యం కారణంగా 1563 మంది అభ్యర్థులకు గ్రేస్‌ మార్కులను ఇచ్చామని, దాంతో 179 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసిన కొందరికి గ్రేస్‌ మార్కులు కలుపుకుని 718, 719 మార్కుల చొప్పన వచ్చాయని ఎన్టీఏ వెల్లడించింది. దాంతో కొందరికి గ్రేస్‌ మార్కులు ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్‌ ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరుపగా.. 1563 మందికి ఎన్టీఏ ఇచ్చిన గ్రేస్‌ మార్కులను రద్దుచేస్తామని కేంద్రం తెలిపింది.

గ్రేస్ కోల్పోయే అభ్యర్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. జూన్‌ 23న వారికి మళ్లీ నీట్‌ పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని, జూన్‌ 30న ఫలితాలను ప్రకటిస్తామని ఎన్టీఏ కూడా కోర్టుకు తెలిపింది. ప్రస్తుతం ఆ 1,563 మంది అభ్యర్థులు గ్రేస్‌ మార్కులు తీసేసి వాస్తవ స్కోర్‌లను తెలియజేస్తామని పేర్కొంది. వాస్తవ మార్కులపై వారి పున:పరీక్ష ఫలితాలు ప్రకటించబడతాయని చెప్పింది. పరీక్షకు హాజరుకాని అభ్యర్థులు వాస్తవ మార్కులతో కౌన్సిలింగ్‌కు హాజరుకావచ్చని తెలిపింది. రీ ఎగ్జామినేషన్‌ ఫలితాలు కౌన్సిలింగ్‌ ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపబోవని పేర్కొంది.

Latest News