Uday Krishna | సీఐ అవమానించడమే సివిల్స్ సాధించేలా చేసింది..!

Uday Krishna | ఆయన చిన్నప్పుడే కన్నవాళ్లను కోల్పోయాడు. నానమ్మ కష్టపడి పెంచి పెద్దచేసింది. మంచి చదువు చెప్పించింది. నానమ్మ కష్టాన్ని వృథా చేయకుండా అతను తొందరగానే కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించాడు. దాంతో మనవడు పోలీస్‌ అయ్యాడని ఆ ముసలమ్మ మురిసిపోయింది. కానీ ఆ మురిపెం మూణ్ణాళ్ల ముచ్చటే అయ్యింది. ఒక సీఐ దారుణంగా అవమానించడంతో అతను ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కానీ ఆ అవమానానికి అతను కుంగిపోలేదు. మరింత పెద్ద ఉద్యోగం సాధించాలని కసితో చదివాడు. ఆఖరికి అనుకున్నది సాధించాడు. సివిల్స్‌ ఫలితాల్లో 780వ ర్యాంకర్‌గా నిలిచాడు.

  • Publish Date - April 17, 2024 / 06:44 PM IST

Uday Krishna : ఆయన చిన్నప్పుడే కన్నవాళ్లను కోల్పోయాడు. నానమ్మ కష్టపడి పెంచి పెద్దచేసింది. మంచి చదువు చెప్పించింది. నానమ్మ కష్టాన్ని వృథా చేయకుండా అతను తొందరగానే కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించాడు. దాంతో మనవడు పోలీస్‌ అయ్యాడని ఆ ముసలమ్మ మురిసిపోయింది. కానీ ఆ మురిపెం మూణ్ణాళ్ల ముచ్చటే అయ్యింది. ఒక సీఐ దారుణంగా అవమానించడంతో అతను ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కానీ ఆ అవమానానికి అతను కుంగిపోలేదు. మరింత పెద్ద ఉద్యోగం సాధించాలని కసితో చదివాడు. ఆఖరికి అనుకున్నది సాధించాడు. సివిల్స్‌ ఫలితాల్లో 780వ ర్యాంకర్‌గా నిలిచాడు.

అతనే ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన మూలగాని ఉదయ్‌కృష్ణారెడ్డి (Uday Krishna Reddy). సింగరాయకొండ మండలం ఊళ్లపాలేనికి చెందిన మూలగాని ఉదయ్‌కృష్ణారెడ్డి తల్లి జయమ్మ తనకు ఐదేళ్ల వయసప్పుడే మరణించారు. తండ్రి శ్రీనివాసులురెడ్డి భరోసా, నానమ్మ రమణమ్మ బాధ్యతలు చూశారు. ఉదయ్‌ ఇంటర్‌ చదువుతున్న సమయంలో తండ్రి శ్రీనివాసులు కూడా చనిపోయారు. తండ్రి అకాల మరణంతో ఉదయ్‌, అతని సోదరుడు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అయితే ఆ సమయంలో నానమ్మ వారికి కొండంత అండగా నిలిచారు. నానమ్మ రమణమ్మ ఇద్దరు మనవళ్లను కష్టపడి చదివించారు.

దాంతో 2013లో ఉదయ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించాడు. అయితే ఓ సీఐ అకారణంగా 60 మంది పోలీసుల ముందు అవమానించడంతో 2018లో అదేరోజు కానిస్టేబుల్‌ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఉంటూ సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యారు. తొలి మూడు ప్రయత్నాల్లోనూ విఫలమైనప్పటికీ ఆత్మవిశ్వాసం సడలకుండా నాలుగోసారి ప్రయత్నించి ఉత్తమ ర్యాంకు సాధించారు. తాను కానిస్టేబుల్‌ ఉద్యోగానికి రాజీనామా చేయడానికి, సివిల్స్‌ ప్రేపర్‌ అవడానికి గల కారణాలను ఉదయ్‌ స్వయంగా వెల్లడించారు.

తన తప్పు లేకున్నా, తప్పు లేదని తెలిసి కూడా సీఐ తిట్టారని, అందుకే అదే రోజున ఉద్యోగానికి రాజీనామా చేశానని ఉదయ్‌ కృష్ణ చెప్పారు. ఐఏఎస్‌ సాధించాలనే పట్టుదలతో కష్టపడి చదవానని, అయితే ప్రస్తుత ర్యాంకును బట్టి ఐఆర్‌ఎస్‌ వస్తుందని అన్నారు. ఆ జాబ్‌లో చేరిన తర్వాత ఐఏఎస్‌ సాధించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. నాడు సీఐ చేసిన అవమానమే నేడు తాను సివిల్స్‌ సాధించేందుకు దోహదపడిందని అన్నారు.

Latest News