Bollywood Actrer Nora Fatehi| బాలీవుడ్ నటి నోరా ఫతేహికి రోడ్డు ప్రమాదం

బాలీవుడ్ నటి నోరా ఫతేహి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. శనివారం సాయంత్రం ముంబైలో నిర్వహించిన ‘సన్‌బర్న్‌’ ఫెస్టివల్‌కు వెళుతుండగా నోరా కారును మరో కారు ఢీ కొట్టిన ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. నోరా ఫతేహి తాను ప్రస్తుతం క్షేమంగా ఉన్నానని సోషల్‌ మీడియాలో వీడియో విడుదల చేశారు.

విధాత : బాలీవుడ్ నటి నోరా ఫతేహి(Bollywood Actrer Nora Fatehi) రోడ్డు ప్రమాదాని(Road Accident)కి గురయ్యారు. శనివారం సాయంత్రం ముంబైలో నిర్వహించిన ‘సన్‌బర్న్‌’ ఫెస్టివల్‌కు వెళుతుండగా నోరా కారును మరో కారు ఢీ కొట్టిన ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానిక ప్రైవైట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ఆమె..కొన్ని గంటల విశ్రాంతి అనంతరం ఈవెంట్ కు హాజరయ్యారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని, అతడిని అదుపులోకి తీసుకున్నామని ముంబై పోలీసులు తెలిపారు.

తాను క్షేమంగానే ఉన్నా : నోరా ఫతేహి

రోడ్డు ప్రమాదానికి గురైన నోరా ఫతేహి తాను ప్రస్తుతం క్షేమంగా ఉన్నానని సోషల్‌ మీడియాలో వీడియో విడుదల చేశారు. ‘‘డ్రింక్‌ చేసిన ఓ కారు డ్రైవర్‌ నా వాహనాన్ని ఢీ కొట్టాడని.. ఈ ఘటనలో నా తల కారు విండోకు బలంగా తలిగిందని..పెద్దగా గాయాలేమి కాలేదని తెలిపారు. ప్రస్తుతానికి తానుబాగానే ఉన్నానని వెల్లడించారు. కొంత కంకషన్‌ (తల తిరగడంలాంటిది), వాపు ఉన్నాయని..గాయాలు ఇంకా మానలేదని తెలిపారు. తనకు ఎదురైన రోడ్డు ప్రమాదం ఓ భయానక ఘటన అని… డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ను ఎవరూ ప్రోత్సహించొద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. మద్యం మత్తులో డ్రైవింగ్‌తో ఎంతోమంది అమాయక ప్రజలు ప్రమాదాలకు గురై చనిపోతున్నారని గుర్తు చేశారు.

 

Latest News