Anaconda Movie Making Video : అనకొండ సినిమాను ఎలా తీశారో చూస్తారా!

అమెజాన్ అడవుల్లో ‘అనకొండ’ మాయాజాలం! ఆ భారీ పామును ఎలా సృష్టించారో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. వైరల్ అవుతున్న మేకింగ్ వీడియోలో చిత్ర యూనిట్ పడ్డ కష్టాలు.

Anaconda Movie Making Video

విధాత : “అనకొండ” సినిమా అమెజాన్ అడవుల్లో సంచరించే భయానకమైన “అనకొండ” పాముల దాడుల కథాంశంతో రూపొందించబడి ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. “అనకొండ” సినిమా అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా $137 మిలియన్ల రికార్డు వసూళ్లతో పాటు 1990దశకంలో కల్ట్ ఫెవరేట్ మూవీగా నిలిచి తదుపరి నాలుగు సీక్వెల్ సినిమాలకు దారి చూపిన సంగతి తెలిసిందే.

ఫారెస్ట్ హర్రర్ థ్రిల్లర్ గా 1997లో వచ్చిన అనకొండ సినిమాలో భారీ అనకొండలను సినిమాలో ఎలా సృష్టించారు…అమెజాన్ అడవుల్లో వాటి దాడులు, వాటితో హీరో హీరోయిన్ల బృందం సాగించిన పోరాట దృశ్యాలు ఎలా చిత్రీకరించారన్నదానిపై తాజాగా ఓ వీడియో వైరల్ అవుతుంది.

అనకొండ సినిమా కోసం రూపొందించిన భారీ యానిమేట్రానిక్ కృత్రిమ అనకొండలతో, జెన్నిఫర్ లోపెజ్ వంటి నటులతో బ్రెజిల్‌లోని మారుమూల అమెజాన్ ప్రాంతాలలో జరిగిన చిత్రీకరణ దృశ్యాలతో ఈ వీడియో ఆసక్తికరంగా సాగింది. చిత్ర బృందం అమెజాన్ అడవుల్లో షూటింగ్ సందర్బంగా డెంగ్యూ జ్వరం బారిన పడటడం, షూటింగ్ కోసం సిద్దం చేసుకున్న పరికరాలు ప్రతికూల వాతావారణ పరిస్థితులలో పనిచేయకపోవడం, అడవులలో ఎదురైన ప్రమాదాలు,60 అడుగుల అనకొండతో పోరాటాల చిత్రీకరణ అంశాలు సహజంగా కనిపించేలా పడిన కష్టాలు వీడియోలో కనిపించాయి. అవన్ని చూస్తే సినిమా చిత్రీకరణ కోసం చిత్ర బృందం పడిన కష్టం కళ్లముందు కనిపిస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వీడియో ఏఐ జనరేటెడ్ గా ఉందని..అయినప్పటికి అనకొండ సినిమా చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ వ్యయప్రయాసాలను చాటేలా ఉందంటున్నారు.

ఇవి కూడా చదవండి :

Kavitha : మీడియా కథనాలపై బీఆర్ఎస్ రాజకీయం
Pakistan Announce T20 WC Squad : ఐసీసీ హెచ్చరికల షాక్.. పాక్‌ జట్టు ప్రకటన

Latest News