Mirai Review | “మిరాయ్” (Mirai) సినిమా రివ్యూ – తేజా సజ్జా, మంచు మనోజ్​ల మ్యాజిక్​ ఎలా ఉంది?

తేజా సజ్జా–మంచు మనోజ్ కాంబోలో వచ్చిన “మిరాయ్” అందమైన విజువల్స్, పౌరాణిక నేపథ్యంతో అలరిస్తుంది. దర్శకుడు కార్తీక్​ ఘట్టమనేని ప్రతిభాపాటవాలకు అద్దం పడుతుందీ సినిమా.

Mirai Review | “మిరాయ్” కథ పౌరాణిక నేపథ్యాన్ని నేటి కాలానికి మిళితం చేస్తూ సాగుతుంది. కళింగ యుద్ధం అనంతరం జరిగిన రక్తపాతం చూసి చలించిన అశోకుడు తన శక్తులను తొమ్మిది గ్రంథాల్లో నిక్షిప్తం చేస్తాడు. ప్రతి గ్రంథానికి ఒక దివ్య శక్తి ఉండగా, వాటిని ప్రపంచమంతటా విభజించి తొమ్మిది మంది రక్షకులకు అప్పగిస్తాడు.

అయితే ప్రస్తుత కాలంలో మహావీర్ లామా (మంచు మనోజ్) అనే క్రూరుడు ఆ గ్రంథాలన్నింటిని చేజిక్కించుకొని దైవత్వం పొందాలని ఆశపడతాడు. చివరిదైన  తొమ్మిదో గ్రంథం అంబిక (శ్రియా శరణ్) వద్ద ఉంటుంది. ఆమె తన కుమారుడు వేద (తేజా సజ్జా)ను రక్షకుడిగా తయారుచేస్తుంది.

తన తల్లి, తన నిర్వర్తించాల్సిన విధి గురించి వేద ఎలా తెలుసుకున్నాడు? ఒక సాధారణ యువకుడు యోధుడిగా మారే ప్రస్థానం ఎలా సాగింది? మహావీర్ లామాను ఎలా ఎదుర్కొన్నాడు? ఇవన్నీ అసలైన కథను చెబుతాయి.

నటీనటుల ప్రదర్శన

సాంకేతిక విశ్లేషణ

 ప్లస్ పాయింట్స్

 మైనస్ పాయింట్స్

“మిరాయ్” ఒక విజువల్ ట్రీట్. మొత్తానికి మిరాయ్​ ఒక  పౌరాణిక, చారిత్రక, వర్తమాన నేపథ్యాల మేలు కలయిక – అన్నీ ప్రేక్షకుడికి అద్భుతమైన అనుభవాన్ని ఇస్తాయి. తేజా సజ్జా తన “హనుమాన్” తర్వాత మరోసారి గొప్ప పాత్ర ఎంచుకున్నాడు. మంచు మనోజ్ పున:ప్రవేశానికి  ఇది మంచి పునాది. నిజానికి మిరాయ్​ దర్శకుడు కార్తీక్​ ఘట్టమనేని పటిమకు ఉదాహరణ. అతని కష్టానికి అన్నీ సరిగ్గా కుదిరాయి.
అయితే సెకండాఫ్ కథనం మరింత క్రిస్ప్‌గా, క్లైమాక్స్ ఎమోషనల్‌గా ఉంటే ఇంకా హైలైట్​ అయ్యేదేమో అనిపించినా, ప్రేక్షకుడు మాత్రం సంతోషంగానే ఫీలవుతాడు. ఇది నిజం.

“మిరాయ్” – తెలుగు చలనచిత్రాలలో మరో అద్భుతమైన మైథలజికల్ ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్.
థియేటర్‌లో భారీ తెరపై చూడాల్సిన సినిమా ఇది. కుటుంబంతో కలసి తప్పక చూడదగ్గ చిత్రం.

విధాత రేటింగ్​ : 3.5/5

Latest News