Manchu Manoj : మంచు మనోజ్ కొత్త రూట్..మ్యూజిక్ సంస్థ షురు!

సినీ హీరో మంచు మనోజ్ ‘మోహన రాగ మ్యూజిక్‌’ పేరుతో కొత్త సంగీత సంస్థను ప్రారంభించారు. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌గా ఈ సంస్థను ఏర్పాటు చేశారు.

Manchu Manoj

విధాత : సినీ హీరో మంచు మనోజ్ కొత్త రూట్ లో ప్రయాణం ఆరంభించారు. ‘మోహన రాగ మ్యూజిక్‌’ పేరుతో సంగీత సంస్థను ప్రారంభించాడు. ఈ విషయాన్ని ఎక్స్ లో పోస్టు చేశాడు. తాను కొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతున్నట్లు ఇటీవల వెల్లడించిన మంచు మనోజ్ కొత్తగా ఒక సంగీత సంస్థను ప్రారంభించినట్లు ప్రకటించారు. ‘మోహన రాగ మ్యూజిక్‌’ పేరుతో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లుతెలిపారు. ‘లోకల్ హార్ట్స్‌, గ్లోబల్‌ బీట్స్‌’ అనే క్యాప్షన్‌తో ఈ విషయాన్ని వెల్లడించారు. సంగీతమంటే తనకెంతో ఇష్టమని..ఈ సంస్థ ద్వారా కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు.

మంచు మనోజ్ ప్రారంభించిన కొత్త ప్రయాణానికి ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మంచు కుటుంబంలో వివాదాలతో సినీ రంగంలో కొంత వెనుబడిన మనోజ్ ఇటీవల ‘భైరవం’, ‘మిరాయ్‌’ సినిమాలతో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం వరుణ్‌ కోరుకొండ దర్శకత్వంలో వస్తున్న ‘వాట్‌ ది ఫిష్‌’ సినిమాలో నటిస్తేన్నారు. భారీ సాంకేతికతో రూపొందుతున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్దమవుతున్నారు.

Latest News