Dhurandhar | బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ నటనను ప్రత్యేకంగా ప్రేమించే ఫ్యాన్స్ ఉన్నారు. అతని ప్రతి పాత్రలో ఉండే ప్యాషన్, ఎనర్జీ, వైవిధ్యం ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. అయితే ఈ మాంత్రిక క్రేజ్ వెనుక సంఖ్యాశాస్త్రం కూడా కీలక పాత్ర పోషిస్తోందని నిపుణులు చెబుతున్నారు. న్యూమరాలజీ ప్రకారం రణవీర్ నంబర్ 6 , దీనికి అధిపతి గ్రహం శుక్రుడు..కళ, సౌందర్యం, వినోదం, ఆకర్షణకు ప్రాతినిధ్యం వహించే గ్రహం.
శుక్ర గ్రహం – రణవీర్ కెరీర్‌లో అదృష్ట గ్రహమా?
సంఖ్యాశాస్త్ర నిపుణుల ప్రకారం నంబర్ 6 వ్యక్తులకు కళలపై స్పెషల్ కనెక్షన్ ఉంటుంది. శుక్రుడు ఉన్న చోట ఆకర్షణ, కాంతి, ప్రదర్శన నైపుణ్యం ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. స్టేజ్ ప్రెజెన్స్, గ్లామర్, మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ ఇవన్నీ శుక్రుడి గిఫ్టులు. అందుకే రణవీర్ ఓ మాస్ క్యారెక్టర్ చేసినా, నెగెటివ్ షేడ్ చేసినా, ఎమోషనల్ రోల్ చేసినా ప్రేక్షకుల్ని వెంటనే ఇంప్రెస్ చేస్తాడు. ధురంధర్ సినిమాలోనూ అతడి నటన, లుక్, ఇంటెన్సిటీ అన్నీ కొత్త లెవల్‌లో ఉన్నాయని విమర్శకుల అభిప్రాయం. నంబర్-6 క్లబ్‌లో హై-ప్రొఫైల్ స్టార్స్ ఉండగా, షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్, మాధురి దీక్షిత్, కరీనా కపూర్ చోటు దక్కించుకున్నారు. ఇలాంటి సూపర్‌స్టార్లు ఉండటం, ఈ నంబర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌లో ప్రభావం ఎంత ఉందో చెబుతోంది.
ధురంధర్ సక్సెస్‌పై న్యూమరాలజీ ప్రిడిక్షన్ చూస్తే.. జ్యోతిష్య, సంఖ్యాశాస్త్ర నిపుణుల విశ్లేషణ ప్రకారం రణవీర్ నంబర్ 6 కాగా, ఈ సంవత్సరం అతనికి మాస్టర్ నంబర్ 33 వైబ్రేషన్, శుక్రుడు పూర్తిగా అనుకూలంగా ఉండడం. ఈ కాంబినేషన్ వల్ల ధురంధర్ కేవలం హిట్ కాదు… హిస్టారికల్ బ్లాక్‌బస్టర్ అవుతుందనే సూచనలు ముందుగానే కనిపించాయని నిపుణులు అంటున్నారు. కొంతమంది నిపుణుల మాటల్లో “రణవీర్ చేసిన సినిమాల్లో ధురంధర్ అతనికి అత్యధిక ఫేమ్, రివార్డ్స్, అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే సినిమా. ఇది ఆస్కార్ రేంజ్ పర్‌ఫార్మెన్స్ కూడా కావచ్చు.”
ధురంధర్ – రణవీర్ కెరీర్‌ని మళ్లీ లైమ్‌లైట్‌లోకి తెచ్చిన మూవీ
2025 డిసెంబర్ 5న విడుదలైన ధురంధర్ చిత్రం జాతీయ భద్రతా విభాగం రియల్-లైఫ్ ఆపరేషన్స్ నేపథ్యంలో తెరకెక్కగా, ఈ చిత్రాన్ని దర్శకుడు ఆదిత్య ధర్ మాస్టర్‌క్లాస్‌గా రూపొందించారు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం 3 గంటల 34 నిమిషాల రన్‌టైమ్ ఉన్నప్పటికీ ప్రేక్షకులు “గ్రిప్పింగ్” అని ప్రశంసలు కురిపిస్తున్నారు. మొదటి మూడు రోజుల్లోనే ₹100 కోట్ల నెట్, ₹160 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది. రణవీర్ మళ్ళీ ఫామ్‌లోకి వచ్చాడని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి…రణవీర్ సింగ్ + నంబర్ 6 + శుక్రుడు = సక్సెస్ కాంబినేషన్ అని నిపుణుల అభిప్రాయం. ధురంధర్ విజయంతో రణవీర్ తిరిగి బాలీవుడ్ అగ్రస్థానంలో నిలిచాడని, అతను భవిష్యత్తులో కూడా పెద్ద విజయాలు అందుకుంటారని సంఖ్యాశాస్త్రం సూచిస్తోంది.
