Allu Arjun | ఈ సంక్రాంతి సీజన్ టాలీవుడ్‌కు అసలు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ నుంచి యువ హీరో నవీన్ పొలిశెట్టి నటించిన ఫ్యామిలీ కామెడీ డ్రామా అనగనగా ఒక రాజు వరకు వరుసగా క్రేజీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన మన శంకరవరప్రసాద్‌గారు మాత్రం ప్రత్యేకంగా నిలుస్తూ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది.
దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను మొదటి ప్రకటన వీడియో నుంచే వినూత్నంగా ప్రమోట్ చేస్తూ వచ్చారు. అదే తరహాలో సినిమాను కూడా పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, ఎమోషన్స్–కామెడీ మిశ్రమంతో తెరకెక్కించారు. చాలా కాలం తర్వాత చిరంజీవిని వింటేజ్ స్టైల్‌లో, ఆయన టైమింగ్‌కు తగ్గ పాత్రలో చూపించడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
సంక్రాంతి సెలవులు కావడంతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు సినిమా విపరీతంగా కనెక్ట్ కావడంతో థియేటర్లలో హౌస్‌ఫుల్ షోలు కొనసాగుతున్నాయి. చిరంజీవితో పాటు వెంకటేశ్ ‘వెంకీ గౌడ’ పాత్రలో కనిపించడం సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది. వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకుల్లో భారీ ఉత్సాహాన్ని నింపింది.
ఈ ప్రభంజనానికి తగినట్లే బాక్సాఫీస్ వసూళ్లు కూడా రికార్డుల దిశగా దూసుకుపోతున్నాయి. కేవలం పది రోజుల్లోనే రూ.300 కోట్ల గ్రాస్‌ను దాటిన సినిమాగా మన శంకరవరప్రసాద్‌గారు ప్రాంతీయ చిత్రాల చరిత్రలో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ విజయంతో చిత్రబృందంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా సినిమాపై తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. పుష్ప 2 ప్రమోషన్ల నిమిత్తం జపాన్ పర్యటన నుంచి తిరిగివచ్చిన బన్నీ, వెంటనే చిరు సినిమా చూసి సోషల్ మీడియాలో స్పందించారు. “బాస్ ఈజ్ బ్యాక్. మెగాస్టార్‌ను మళ్లీ వింటేజ్ వైబ్స్‌తో చూడటం చాలా సంతోషంగా ఉంది” అంటూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. వెంకటేశ్ షోను రాక్ చేశారని, సంగీతం నుంచి నటుల ఎనర్జీ వరకు అన్నీ సినిమాకు బలంగా నిలిచాయని ప్రశంసించారు. ముఖ్యంగా దర్శకుడు అనిల్ రావిపూడిని ఉద్దేశించి “సంక్రాంతికి వస్తారు… హిట్టు కొడతారు… రిపీట్” అంటూ ప్రత్యేకంగా అభినందించారు.
బన్నీ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మొత్తానికి మన శంకరవరప్రసాద్‌గారు ఈ సంక్రాంతికి బ్లాక్‌బస్టర్‌గా మాత్రమే కాకుండా, ‘సంక్రాంతి బాస్‌బస్టర్’గా కొత్త నిర్వచనం సృష్టిస్తూ టాలీవుడ్‌లో సంచలనంగా నిలుస్తోంది.
