Prabhas| ప్రభాస్ ‘స్పిరిట్‌’ షూటింగ్ ప్రారంభం

ప్రభాస్‌ హీరోగా దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ప్రకటించిన చిత్రం ‘స్పిరిట్‌’ మూవీ షూటింగ్ ఆదివారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై స్పిరిట్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

విధాత : ప్రభాస్‌ (Prabhas)హీరోగా దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) ప్రకటించిన చిత్రం ‘స్పిరిట్‌’ మూవీ(Spirit Movie) షూటింగ్ ఆదివారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ముఖ్య అతిథిగా హాజరై స్పిరిట్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి సంచలన చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి తెరకెక్కిస్తున్న‘స్పిరిట్‌’ మూవీ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందబోతుండగా.. ఈ సినిమాలో ప్రభాస్‌ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ నటి త్రిప్తి డిమ్రి నటిస్తున్నారు.ప్రకాశ్‌ రాజ్‌, వివేక్‌ ఒబెరాయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారతీయ భాషలతోపాటు జపనీస్‌, కొరియన్‌, మాండరిన్‌లో విడుదల చేయనున్నారు. టీ- సిరీస్, భద్రకాళి పిక్చర్స్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్లలో ప్రణయ్‌రెడ్డి వంగా, భూషణ్‌కుమార్, క్రిషన్‌కుమార్‌ నిర్మిస్తున్నారు.

Latest News