Raja Saab Trailer | మన టైమ్ స్టార్ట్ అయింది.. ‘ది రాజా సాబ్’ ట్రైలర్ 2.0 రిలీజ్, డిఫరెంట్ లుక్స్‌లో అదరగొట్టిన ప్ర‌భాస్

Raja Saab Trailer | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు మరోసారి పండగ మొదలైంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ది రాజా సాబ్’ ట్రైలర్ 2.0ను మేకర్స్ సోమవారం (డిసెంబర్ 29) విడుదల చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన మొదటి ట్రైలర్‌తో భారీ అంచనాలు ఏర్పడగా, ఇప్పుడు వచ్చిన ట్రైలర్ 2.0 ఆ హైప్‌ను డబుల్ చేసింది.

Raja Saab Trailer | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు మరోసారి పండగ మొదలైంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ది రాజా సాబ్’ ట్రైలర్ 2.0ను మేకర్స్ సోమవారం (డిసెంబర్ 29) విడుదల చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన మొదటి ట్రైలర్‌తో భారీ అంచనాలు ఏర్పడగా, ఇప్పుడు వచ్చిన ట్రైలర్ 2.0 ఆ హైప్‌ను డబుల్ చేసింది. ట్రైలర్ ప్రారంభం నుంచే ప్రభాస్‌ను పూర్తిగా కొత్త అవతారాల్లో చూపిస్తూ ఆసక్తిని పెంచింది. ఒకవైపు వింటేజ్ ప్రభాస్ స్టైల్, మరోవైపు వైలెంట్, ఇంటెన్స్ లుక్స్‌తో డార్లింగ్ అభిమానులకు విజువల్ ఫీస్ట్ అందించింది. ముఖ్యంగా “మన టైమ్ స్టార్ట్ అయింది” అనే డైలాగ్‌తో ప్రభాస్ ఎంట్రీ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.

మేకర్స్ ఈ ట్రైలర్‌ను విడుదల చేస్తూ సోషల్ మీడియాలో “ది రాజా సాబ్ ట్రైలర్ 2.0.. మీరు ఊహించిన దానికంటే ఎక్కువే. పర్ఫార్మెన్సెస్, విజువల్స్, మ్యూజిక్.. అన్నీ కలిసి ఈ సంక్రాంతికి ఓ అద్భుతమైన అనుభవాన్ని అందించబోతున్నాయి. జనవరి 9, 2026న థియేటర్లలో” అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేశారు. మొదటి ట్రైలర్‌కు కొనసాగింపుగా రూపొందిన ఈ ట్రైలర్ 2.0లో గ్రాండ్ విజువల్స్ మరింత హైలైట్‌గా నిలిచాయి. భారీ సెట్‌లు, హారర్ ఎలిమెంట్స్, పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై ఉన్న అంచనాలను ఆకాశానికి చేర్చేశాయి. ఇక ప్రభాస్‌ను ఒక్కటే కాదు, విభిన్న లుక్స్‌లో చూపించడం ఈ ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారింది.

మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లోనే ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్‌గా ఉండబోతోందని ట్రైలర్ 2.0 స్పష్టంగా చెబుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలోకి రానున్న ‘ది రాజా సాబ్’, బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించబోతుందనే అంచనాలను ఈ ట్రైలర్ మరింత బలపరిచింది. మొత్తానికి తాజా ట్రైల‌ర్‌తో మూవీపై అంచ‌నాలు భారీగా పెరిగాయి. చాలా రోజుల త‌ర్వాత ప్ర‌భాస్ నుండి ఈ సినిమా వ‌స్తుండ‌డంతో ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన ట్రైల‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి

 

Latest News