Raja Saab | ‘ది రాజా సాబ్’ అప్డేట్స్ లేట్… ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై అనిశ్చితి, ప్రభాస్ ఫ్యాన్స్‌లో అసహనం

Raja Saab | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ విషయంలో జరుగుతున్న వరుస ఆలస్యాలు అభిమానుల్లో తీవ్ర అసహనాన్ని పెంచుతున్నాయి. ఇప్పటికే అప్డేట్స్ సరైన టైమ్‌కు రాకపోవడం ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురి చేస్తుండగా,ఈ రోజు జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక‌కి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక కన్ఫర్మేషన్ లేకపోవడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మారుస్తోంది.

Raja Saab | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ విషయంలో జరుగుతున్న వరుస ఆలస్యాలు అభిమానుల్లో తీవ్ర అసహనాన్ని పెంచుతున్నాయి. ఇప్పటికే అప్డేట్స్ సరైన టైమ్‌కు రాకపోవడం ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురి చేస్తుండగా,ఈ రోజు జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక‌కి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక కన్ఫర్మేషన్ లేకపోవడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మారుస్తోంది. మొదట ఈ వేడుకను హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించాలని భావించారు. అయితే అనుమతులు లభించకపోవడంతో ఆ ప్లాన్‌ను రద్దు చేసి రామోజీ ఫిల్మ్ సిటీని ఆప్షన్‌గా చూశారని సమాచారం. తాజాగా కూకట్‌పల్లిలోని కైతలాపూర్ మైదానంలో ఈవెంట్ నిర్వహించేందుకు పర్మిషన్ లెటర్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి అధికారిక అప్రూవల్ వచ్చిందో లేదో ఇంకా స్పష్టత లేదు. సరైన సమాచారం లేకపోవడంతో ఫ్యాన్స్ ఎక్కడికి రావాలి? అసలు ఈవెంట్ జరుగుతుందా? అన్న సందేహాలతో వేచి చూస్తున్నారు.

జనవరి 9న విడుదలకు సిద్ధమవుతున్న ‘ది రాజా సాబ్’కు ఇప్పుడు కేవలం 13 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. ఇప్పటివరకు రెండు టీజర్లు, రెండు పాటలు విడుదలయ్యాయి. వీటికి స్పందన బాగానే వచ్చినప్పటికీ, అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లే స్థాయిలో మాత్రం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే కొత్త ట్రైలర్ కట్ సిద్ధం చేశారని, దర్శకుడు మారుతీ బృందం పోస్ట్ ప్రొడక్షన్ పనులను చివరి దశకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సినిమా సెన్సార్ పూర్తయిందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కానీ దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాకపోవడం ఆందోళనగా మారింది. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం “ఎప్పుడూ మా సినిమాలకే ఇలా జరుగుతుంది” అంటూ సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ టైమ్‌లోనూ ఇలాంటి వాయిదాలు, ఆలస్యాలు ఎదురవ్వడంతో ఇప్పుడు అదే పరిస్థితి ‘రాజా సాబ్’కు రిపీట్ అవుతుందన్న భావన వాళ్లను మరింత ఆవేదనకు గురి చేస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు భారీగా అతిథులు రావచ్చన్న అంచనాలు పెద్దగా లేకపోయినా, ప్రభాస్ హాజరు కావ‌డ‌మే ఈ వేడుకకు మెయిన్ అట్రాక్షన్‌గా నిలవనుందని అభిమానులు భావిస్తున్నారు. ‘స్పిరిట్’ సినిమా కోసం ప్రత్యేకంగా మేకోవర్ చేసుకున్న డార్లింగ్, అదే లుక్‌లో ఈ ఈవెంట్‌లో కనిపిస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ త్వరగా పబ్లిసిటీ వేగాన్ని పెంచాలని, కొత్త ప్రమోషనల్ స్ట్రాటజీలతో ముందుకు రావాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

అదే సమయంలో సంక్రాంతి సీజన్‌లో పోటాపోటీగా పలు సినిమాలు థియేటర్లలోకి రానుండటంతో ‘ది రాజా సాబ్’ ప్రయాణం అంత తేలికగా ఉండబోదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. బలమైన కంటెంట్‌తో వస్తున్న ఇతర చిత్రాల మధ్య రాజా సాబ్ ఎంతవరకు నిలబడుతుందన్నది ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. ఇలాంటి సమయంలో సరైన ప్లానింగ్‌తో ప్రమోషన్స్ చేయడం ఎంతో కీలకమని విశ్లేషకులు చెబుతున్నారు.

Latest News