Shambhala Mystical Trailer | శంబాల ట్రైల‌ర్ విడుద‌ల‌.. అతీంద్రియ శక్తి, మనుషుల మధ్య జరిగే సంఘర్షణగా చిత్ర కథ

Shambhala Mystical Trailer | యంగ్ హీరో ఆది సాయికుమార్ ఈసారి రొటీన్ కమర్షియల్ సినిమాలకు దూరంగా, పూర్తిగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘శంబాల’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, గ్లింప్స్ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేయగా… తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది.

Shambhala Mystical Trailer | యంగ్ హీరో ఆది సాయికుమార్ ఈసారి రొటీన్ కమర్షియల్ సినిమాలకు దూరంగా, పూర్తిగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘శంబాల’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, గ్లింప్స్ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేయగా… తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ కావడంతో సినిమాపై ఒక్కసారిగా హైప్ పెరిగిపోయింది. ట్రైలర్ విజువల్స్ గ్రాండ్‌గా ఉండటమే కాకుండా, ఆది చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ట్రైలర్ కట్ చూస్తే ఈసారి ఆది కెరీర్‌లో ఒక బలమైన సినిమాతో రాబోతున్నాడనే ఫీలింగ్ కలుగుతోంది.

ట్రైలర్ ఆరంభం నుంచే మిస్టరీ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. ఆకాశం నుంచి ఊహించని విధంగా పడే ఉల్క, దాని చుట్టూ అల్లుకున్న కథే సినిమా మెయిన్ పాయింట్‌గా కనిపిస్తోంది. “పంచభూతాల్ని శాసిస్తోందంటే… ఇది సాధారణమైనది కాదు” అనే బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ సినిమాకి కావాల్సిన ఇంటెన్సిటీని అందించింది. ఒక అతీంద్రియ శక్తి, మనుషుల మధ్య జరిగే సంఘర్షణగా కథ సాగబోతోందని ట్రైలర్ స్పష్టంగా చెబుతోంది.ఈ సినిమాలో ఆది క్యారెక్టరైజేషన్ పూర్తిగా కొత్తగా డిజైన్ చేశారు. మూఢనమ్మకాలను అస్సలు నమ్మని సైంటిస్ట్ పాత్రలో ఆయన కనిపించారు.“మీ కాకమ్మ కాశీ మజిలీ కథలు ఊరు జనాలకు చెప్పండి… నాకు కాదు” అనే డైలాగ్‌తో ఆయన ఆటిట్యూడ్‌ను బలంగా చూపించారు. శాస్త్రాన్ని నమ్మే హీరోకి, మూఢనమ్మకాలతో నిండిన గ్రామానికి మధ్య వచ్చే క్లాష్ సినిమాకి కీలకంగా ఉండబోతుందని తెలుస్తోంది.

యాక్షన్ సన్నివేశాలు కూడా ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి. ముఖ్యంగా బలి ఇచ్చే కాన్సెప్ట్‌ను హీరో ఎదిరించే సీన్ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. “ఇప్పటి నుంచి మీ పిచ్చితనానికి ఎవరినీ బలి కానివ్వను… అది ఆవైనా సరే, చీమైనా సరే” అంటూ ఆది ఇచ్చే వార్నింగ్ మాస్ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకునేలా ఉంది. విలన్లతో ఆయన చేసే ఫైట్స్ కూడా స్టైలిష్‌గా రూపొందించారు. మరోవైపు కథలో దైవత్వాన్ని కూడా బలంగా టచ్ చేశారు.విధి నిన్ను ఇక్కడికి రప్పించింది… నువ్వే ఈ సమస్యకి కొత్త పరిష్కారం కనిపెడతావేమో” అనే డైలాగ్ సినిమా అసలు కథా సారాన్ని బయటపెడుతోంది. ఆ గ్రామాన్ని కాపాడాల్సిన బాధ్యత హీరో మీద పడుతుందని అర్థమవుతోంది. విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సన్నివేశాలకు మరింత బలం చేకూర్చాయి. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ‘శంబాల’ డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అదిరిపోయే విజువల్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ఈ సినిమాపై అంచనాలు డబుల్ అయ్యాయి. చూస్తుంటే ఆది సాయికుమార్ ఈసారి బిగ్ హిట్ కొట్టేలా ఉన్నాడనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది.

 

Latest News