Spirit | ఎట్ట‌కేల‌కి మొద‌లైన స్పిరిట్ షూటింగ్‌.. క్లాప్ కొట్టి ప్రారంభించిన మెగాస్టార్

Spirit | సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో 'స్పిరిట్' సినిమా తెర‌కెక్క‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళుతుందా అని అభిమానులు కొన్నాళ్లుగా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తూ వ‌చ్చారు.

Spirit | సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో ‘స్పిరిట్’ సినిమా తెర‌కెక్క‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళుతుందా అని అభిమానులు కొన్నాళ్లుగా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తూ వ‌చ్చారు. ఎట్ట‌కేల‌కి ఈ మూవీ షూటింగ్ నేడు ప్రారంభ‌మైంది. ఆదివారం ముహూర్తపు పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరై టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి ఇచ్చిన క్లాప్‌తో తొలి షాట్‌ను చిత్రీకరించడం ఈ కార్యక్రమానికి హైలైట్‌గా నిలిచింది.సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ నటీమణి త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ప్రముఖ నటులు వివేక్ ఒబెరాయ్, ప్రకాశ్ రాజ్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.

భూషణ్ కుమార్ నేతృత్వంలోని టీ-సిరీస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, ప్రణయ్ రెడ్డి వంగా కలిసి భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా టీమ్ ఇప్పటికే #OneBadHabit హ్యాష్‌ట్యాగ్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేసింది. ప్రస్తుతం ముహూర్తం నుంచి బయటకు వచ్చిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.ప్రభాస్ కెరీర్‌లో ఇది మరో భారీ సినిమా కానుందని ఫ్యాన్స్ భారీగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాలతో మార్క్ క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా – స్టార్ హీరో ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా భారీ హైప్ నెలకొంది.

స్పిరిట్ చిత్రంలో ప్రభాస్ ను సందీప్ ఎలా చూపిస్తాడా? అనే ఉత్కంఠ డార్లింగ్ అభిమానుల్లోనేకాదు.. మొత్తం సినీ ల‌వ‌ర్స్‌లో కూడా నెలకొంది. కొరియాకు చెందిన విలన్ డాన్ లీని రంగంలోకి దింపుతుండ‌డంతో మూవీపై మ‌రింత హైప్ పెరిగింది. రెండు భీకర విగ్రహాలు హోరాహోరీగా కొట్టుకుంటే చూడాల‌ని యాక్ష‌న్ ప్రియులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Latest News