Varanasi | అరుదైన యుద్ధ విద్యలో మహేష్ బాబు శిక్షణ.. మ‌హేష్ బాబుని రాజ‌మౌళి గ‌ట్టిగానే రుద్దుతున్నాడుగా..!

Varanasi | టాలీవుడ్ జేమ్స్ బాండ్‌గా పేరు తెచ్చుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కనున్న ఈ భారీ అడ్వెంచర్ థ్రిల్లర్ కోసం మహేష్ బాబు గత ఏడాది కాలంగా తన లుక్‌ను పూర్తిగా మార్చుకుని అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు.

Varanasi | టాలీవుడ్ జేమ్స్ బాండ్‌గా పేరు తెచ్చుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కనున్న ఈ భారీ అడ్వెంచర్ థ్రిల్లర్ కోసం మహేష్ బాబు గత ఏడాది కాలంగా తన లుక్‌ను పూర్తిగా మార్చుకుని అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. పొడవాటి జుట్టు, గడ్డంతో మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో కనిపిస్తూ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నారు. అయితే ఈ సినిమా కోసం ఆయన చేస్తున్న సిద్ధం లుక్‌కే పరిమితం కాకుండా, యాక్షన్ పరంగానూ అత్యంత కఠినంగా ఉంది.

తాజా సమాచారం ప్రకారం, రాజమౌళి సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాల కోసం మహేష్ బాబు కేరళలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. అక్కడి అత్యంత పురాతనమైన, శక్తివంతమైన యుద్ధ విద్య అయిన ‘కలరిపయట్టు’లో ఆయన ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యుద్ధ విద్యలో నైపుణ్యం సాధించడం అంత సులభం కాదు. శారీరక దృఢత్వంతో పాటు అపారమైన ఏకాగ్రత అవసరమయ్యే ఈ కళను మహేష్ బాబు స్వయంగా నేర్చుకుంటూ, డూప్ లేకుండా యాక్షన్ సీన్లను చేయాలనే పట్టుదలతో ముందుకెళ్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ శిక్షణకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది.

ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో షూటింగ్ జరుపుకోనుండగా, ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ప్రాజెక్ట్‌గా ప్రచారం జరుగుతోంది. ఇందులో మహేష్ బాబు పాత్ర ఒక సాహసికుడిగా ఉండబోతుందని, అడవులు, ప్రకృతి నేపథ్యాల్లో సాగే ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని తెలుస్తోంది. ఆ అడవి నేపథ్య పోరాట సన్నివేశాల కోసమే ఈ కలరిపయట్టు శిక్షణ కీలకంగా ఉపయోగపడనుందన్న టాక్ వినిపిస్తోంది.

కేరళలోని ఒక శిక్షణ కేంద్రంలో మహేష్ బాబు యుద్ధ విద్యలు నేర్చుకుంటున్న దృశ్యాలను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. రాజమౌళి సినిమాల్లో హీరోల మేకోవర్, పాత్ర రూపకల్పన ఎలా ప్రత్యేకంగా ఉంటుందో తెలిసిందే. ఇప్పుడు మహేష్ బాబు విషయంలో కూడా అదే మ్యాజిక్ మరోసారి రిపీట్ కానుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మహేష్ బాబు అంకితభావం, రాజమౌళి మార్క్ విజన్ కలిసి వస్తే ఈ సినిమా భారతీయ సినిమా స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కలరిపయట్టు విన్యాసాలను వెండితెరపై చూడటానికి అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Latest News