Vishwambara | విశ్వంభర’ రిలీజ్ డేట్‌పై ఉత్కంఠ ..స‌మ్మ‌ర్ నుండి త‌ప్పుకుందా?

Vishwambara | ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో మెగా అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. థియేటర్ల వద్ద ఏర్పడిన జోరు, కలెక్షన్ల రేంజ్ మరోసారి చిరంజీవి మార్కెట్ స్థాయిని చాటాయి. ఈ హిట్ ఇచ్చిన జోష్‌తో మెగాస్టార్ నుంచి రాబోయే తదుపరి చిత్రం ‘విశ్వంభర’పై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

chiranjeevi-vishwambhara-glimpse-release

Vishwambara | ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో మెగా అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. థియేటర్ల వద్ద ఏర్పడిన జోరు, కలెక్షన్ల రేంజ్ మరోసారి చిరంజీవి మార్కెట్ స్థాయిని చాటాయి. ఈ హిట్ ఇచ్చిన జోష్‌తో మెగాస్టార్ నుంచి రాబోయే తదుపరి చిత్రం ‘విశ్వంభర’పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ‘బింబిసార’తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వశిష్ట మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ సోషియో ఫాంటసీ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. అనౌన్స్‌మెంట్‌ రోజునుంచే ఈ ప్రాజెక్ట్‌పై భారీ హైప్ ఏర్పడింది. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీపై స్పష్టత లేకపోవడంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

ఇప్పటివరకు ‘విశ్వంభర’ను సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయాలనే ప్రచారం సాగింది. కానీ తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం సమ్మర్ రేసు నుంచి తప్పుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ‘మన శంకరవరప్రసాద్ గారు’ విడుదలైన వెంటనే మరో సినిమా తీసుకురావడం కన్నా కొంత గ్యాప్ ఇవ్వడం మంచిదని మేకర్స్ భావిస్తున్నారని సమాచారం. అందుకే సమ్మర్ తర్వాత, జూలై 10న సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది.రిలీజ్ ఆలస్యం వెనుక ఉన్న కారణాలపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, లుక్స్ ఫాంటసీ ప్రపంచాన్ని చూపించినప్పటికీ, వీఎఫ్ఎక్స్ క్వాలిటీపై కొన్ని విమర్శలు వచ్చాయి. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న మేకర్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అదనపు సమయం కేటాయిస్తున్నారని తెలుస్తోంది.

టాప్ వీఎఫ్ఎక్స్ స్టూడియోలతో కలిసి పనులు వేగంగా సాగుతున్నాయని సమాచారం. ప్రేక్షకులకు అంతర్జాతీయ స్థాయి విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలనే లక్ష్యంతో ప్రతి ఫ్రేమ్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టుతున్నారట.ఫైనల్ కాపీ సిద్ధమైన తర్వాత, చిరంజీవి స్వయంగా చూసి సంతృప్తి చెందినప్పుడే రిలీజ్ డేట్‌పై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని టాక్. అందుకే మేకర్స్ ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం లేదని తెలుస్తోంది.ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తుండటం మరో ప్లస్. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘స్టాలిన్’ అప్పట్లో మంచి స్పందన పొందింది. అలాగే ‘నా సామిరంగ’ ఫేం ఆషికా రంగనాథ్ మరో ముఖ్య పాత్రలో కనిపించనుంది. కునాల్ కపూర్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి, సురభి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండటం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.

Latest News