ఢిల్లీ: భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ రాజధాని న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్ వేదికగా ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కజాతీయ జెండా ను ఆవిష్కరించి సైనిక వందనం స్వీకరించారు. వేడుకలలో 4 ఎంఐ 17 హెలికాప్టర్లు పూల వర్షం కురిపించాయి. ఈ వేడుకల్లో ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఐరోపా మండలి అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ హాజరయ్యారు.
భారత వ్యోమగామి శుభాంశు శుక్లాకు రాష్ట్రపతి అశోకచక్ర పురస్కారం ప్రదానం చేశారు. పరేడ్ లో ఐరోపా సమాఖ్య కు చెందిన సైనిక బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ రాష్ట్రాల ప్రగతి శకటాలు, త్రివిధ దళాల సైనిక సామర్థ్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
