విధాత : అందం..అభినయం కలబోతగా ఆకట్టుకునే హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కు తెలుగు ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఉంది. తరచు సోషల్ మీడియాలో, ఫ్యాషన్ షోలలో గ్లామర్ డ్రెస్ లతో అందాల ఆరబోత చేయడమే కాదు.. అప్పడప్పుడు భారతీయత ఉట్టిపడేలా చీర కట్టుతోనూ మెస్మరైజ్ చేస్తుంటుంది. తాజాగా మృణాల్ ఠాకూర్ హైదరాబాద్‌లో విమానాశ్రయంలో చీర కట్టుతో కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చీరకట్టులో మృణాల్ ఠాకూర్ ను చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. విమానాశ్రయాల్లో ఇలా చీర కట్టుతో కనిపించే హీరోయిన్ చాలా అరుదు అని..మృణాల్ చీరకట్టులో చాలా అందంగా ఉందంటూ మెచ్చుకుంటున్నారు.
సిరీయల్స్ నుంచి సినిమాలలో అడుగుపెట్టిన ఈ మరాఠీ భామ హీరో దుల్కర్ సల్మాన్ తో జంటగా “సీతారామం” సినిమాలో సీత పాత్రతో తెలుగు ఆడియన్స్ హృదయాలను గెలుచుకుంది. హీరో నానితో చేసిన “హాయ్ నాన్న” సినిమాతో తెలుగులో తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను మరింత పెంచుకుంది. విజయ దేవరకొండతో “ఫ్యామిలీ స్టార్” సినిమా అంతంత మాత్రమే ఆడినా..తన నటన, గ్లామర్ తో మాత్రం ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఆ తర్వాత హీందీలో సన్నాఫ్ సర్ధార్ 2 సినిమా కూడా నిరాశ పరిచింది. దీంతో మృణాల్‌కి ఆఫర్లు కాస్త తగ్గిపోయాయి. ఇప్పుడామె చేతిలో తెలుగు సినిమా అడవి శేషు హీరోగా తెరకెక్కుతున్న “డెకాయిట్” ఒక్కటే ఉంది. బన్నీ, ఆట్లీ మూవీలో హీరోయిన్లలో మృణాల్ కూడా ఉందని తెలుస్తున్న దీనిపై క్లారిటీ లేదు. ఏది ఏమైన మృణాల్ కు సరైన సినిమా ఛాన్స్ లు దక్కాలే గాని తెలుగు ఆడియన్స్ ఆదరించేందుకు ఎప్పుడు సిద్దంగానే ఉన్నారు. తనను ఆదరించిన టాలీవుడ్ ప్రేక్షకుల కోసం తెలుగు సినిమాల్లో వచ్చే ఏ ఛాన్స్ వదులుకోనంటు చెప్పి..తెలుగు అభిమానులను మృణాల్ మరింత మురిపించింది.
Actress #MrunalThakur spotted at Hyderabad. Airport look for an actress in a saree is rare and she is looking gorgeous! pic.twitter.com/I1XxuqKH2W
— idlebrain.com (@idlebraindotcom) November 10, 2025
