Begumpet Railway Station | హైదరాబాద్ : ఎయిర్‌పోర్టు( Airport )ను తలపిస్తోంది బేగంపేట రైల్వే స్టేషన్( Begumpet Railway Station ). సరికొత్త హంగులతో, అధునాతన సదుపాయాలతో బేగంపేట రైల్వేస్టేషన్( Begumpet Railway Station )ను తీర్చిదిద్దారు. ఈ రైల్వే స్టేషన్‌లోకి అడుగు పెడితే.. ఏదో ఎయిర్‌పోర్టు( Airport )లో విహరిస్తున్న అనుభూతి కలుగుతుంది. అమృత్ భారత్ స్టేషన్(Amrit Bharat Stations ) పథకం కింద ప్రత్యేక వసతులతో బేగంపేట రైల్వే స్టేషన్‌ను ఆధునీకరించారు.
ఆధునిక హంగులే కాదు.. బేగంపేట రైల్వే స్టేషన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు ఈ స్టేషన్‌లో స్త్రీ, పురుషులు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించే వారు. కానీ మే 22 నుంచి ఈ స్టేషన్‌లో అందరూ మహిళా సిబ్బందే( Woman Staff ) విధులు నిర్వర్తించనున్నారు. పోలీసు పహారా కూడా మహిళా పోలీసులే నిర్వర్తించనున్నారు. ఇక బేగంపేట స్టేషన్‌లో ఏ ఒక్క పురుష ఉద్యోగికి స్థానం లేదన్నమాట. దక్షిణ మధ్య రైల్వే( South Central Railway ) పరిధిలో మొత్తం మహిళా సిబ్బందితో నడిచే మొట్టమొదటి స్టేషన్ బేగంపేట రైల్వే స్టేషన్ కావడం విశేషం.
రూ. 25 కోట్లతో ఎయిర్‌పోర్టును తలపించేలా ఆధునీకరించిన బేగంపేట రైల్వే స్టేషన్( Amrit Bharat Stations )ను ప్రధాని నరేంద్ర మోదీ( PM Modi ) మే 22న ఉదయం 9.30 గంటలకు విర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. ఇందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బేగంపేట రైల్వే స్టేషన్‌తో పాటు వరంగల్( Warangal ), కరీంనగర్( Karimnagar ) రైల్వే స్టేషన్లను కూడా మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.
అమృత్ భారత్ స్టేషన్( Amrit Bharat Stations ) పథకం కింద కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను( Railway Stations ) అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, స్టేషన్లను ఆధునీకరించడం వంటి పనులు చేపడుతున్నారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన వేచి ఉండే ప్రాంతాలు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, ఉచిత వై-ఫై సదుపాయం కల్పించడం. దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు, లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేయడం.
స్టేషన్లలో ప్రయాణికుల సమాచార వ్యవస్థను మెరుగుపరచడం, పర్యావరణ అనుకూలమైన పద్ధతులను అవలంబించడం, నీటి సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలను ఏర్పాటు చేయడం వంటివి వీటిలో భాగంగా ఉంటాయి. తెలంగాణలో అమృత్ భారత్ పథకం కింద ఎంపికైన రైల్వే స్టేషన్లలో ముఖ్యంగా.. సికింద్రాబాద్, బేగంపేట్, కాచిగూడ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, రామగుండం, నల్గొండ, మిర్యాలగూడ, జనగాం, భువనగిరి, మధిర, యాదాద్రి వంటి స్టేషన్లు ఉన్నాయి. అయితే వీటిలో వరంగల్, కరీంనగర్, బేగంపేట్ రైల్వే స్టేషన్ల పనులు పూర్తయ్యాయి. అమృత్ భారత్ పథకం కింద దేశవ్యాప్తంగా 1309 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయడానికి ఎంపిక చేశారు.