Site icon vidhaatha

Gold | శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో.. భారీగా బంగారం పట్టివేత !

విధాత, హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం ప‌ట్టుబ‌డింది. దుబాయ్ నుంచి వ‌చ్చిన ప్ర‌యాణికుడి నుంచి 3.5 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం ర‌వాణాకు సంబంధించి ఎలాంటి ధ్రువ‌ప‌త్రాలు లేవ‌ని అధికారులు తేల్చారు.

ఈ బంగారాన్ని అక్ర‌మంగా త‌ర‌లించిన‌ట్లు అధికారులు నిర్ధారించారు. బంగారం ధ‌ర‌లు ల‌క్ష రూపాయాల‌కు చేరువైన నేప‌థ్యంలో త‌క్కువ ధ‌ర‌కు బంగారం లభించే దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం స్మ‌గ్లింగ్ చేసి.. ఇక్క‌డ సొమ్ము చేసుకుంటున్న‌ట్టు సమాచారం. బంగారం త‌ర‌లించిన వ్య‌క్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Exit mobile version