Pradeep Ranganathan & Mamitha Baiju Fun On Stage | స్టేజీపైనే హీరోయిన్ బుగ్గ గిల్లి..జుట్టు పట్టిన డ్యూడ్ హీరో

'డ్యూడ్' మూవీ ప్రమోషన్ ఈవెంట్‌లో హీరో ప్రదీప్ రంగనాథన్, హీరోయిన్ మమితా బైజు రచ్చ చేశారు. సినిమాలో ఉన్న బుగ్గ గిల్లే సీన్‌ను స్టేజీపై రివర్స్ రోల్‌లో చేస్తూ.. ప్రదీప్ మమిత బుగ్గలు గిల్లి, జుట్టు పట్టి లాగడం వైరల్‌గా మారింది.

Pradeep Ranganathan Mamitha Baiju Dude movie promotion

విధాత: తమిళ హీరో ప్రదీప్‌ రంగనాథన్‌ లెటెస్ట్ మూవీ డ్యూడ్ ఆక్టోబర్ 17న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. మూవీ ప్రమోషన్ లో భాంగా బుధవారం నిర్వహించిన స్వాగ్‌ ఈవెంట్‌ లో హీరో హీరోయిన్లు ప్రదీప్ రంగనాధన్, మమితా బైజు రచ్చ చేశారు. డ్యూడ్‌ చిత్రంలో హీరోను బుగ్గగిల్లి క్యూట్‌గా ఫీలవుతుంది మమిత. ఈ సీన్‌ను స్టేజీపై రివర్స్‌ రోల్స్‌లో చేశారు. మమిత బుగ్గలు గిల్లి, జుట్టు పట్టుకుని లాగి, కొడుతున్నట్లుగా నటించే క్రమంలో ప్రదీప్‌ జీవించేశాడు. దింతో మమితా ఇది క్యూట్‌గా లేదు అంటు చెప్పగా..యాంకరమ్మ కూడా నిజంగానే ఇది క్యూట్‌గా లేదమ్మా.. ఇంత వైలెంట్‌గా ఉన్నారేంటి? అంటూ నవ్వేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

అయితే ఈ వేడుకలో మూవీ పాటలకు మమిత ఎనర్జిటిక్ తో చేసిన డ్యాన్స్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. చేసింది. ‘లవ్‌టుడే’, ‘డ్రాగన్‌’ సినిమాలతో హీరో ప్రదీప్‌ రంగనాథన్‌ పాపులార్ అయ్యాడు. డ్యూడ్ తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నాడు. డ్యూడ్ సినిమా ప్రమోషన్స్ తో హీరోహీరోయిన్లు తెలుగు రాష్ట్రాలలో కూడా సందడి చేస్తున్నారు.

Latest News