Rashmika & Ayushmann Seek Blessings At Shirdi | షిరిడీ సాయిని దర్శించుకున్న రష్మిక మందన్న

'థామా' సినిమా విడుదల నేపథ్యంలో నటి రష్మిక మందన్న హీరో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి షిరిడీ సాయిబాబాను దర్శించుకున్నారు. అక్టోబర్ 21న ఈ సినిమా విడుదల కానుంది.

Rashmika Mandanna And Ayushmann Khurrana Shiridi Visit

విధాత: సినీ నటి రష్మిక మందన్న మంగళవారం షిరిడీ సాయినాధుడిని దర్శించుకున్నారు. ‘థామా’ సినిమా ఈనెల 21న విడుదల కానున్న నేపథ్యంలో ఈ మూవీ హీరో ఆయుష్మాన్ ఖురానా, చిత్రబృందంతో కలిసి రష్మిక షిరిడీకి వచ్చి సాయిబాబాను సేవించుకున్నారు. అంతకుముందు విక్కీ కౌశల్ తో నటించిన ఛావా సినిమా విడుదలకు ముందు కూడా రష్మిక సాయిబాబాను దర్శించుకున్నారు.

స్త్రీ (2018), భేడియా (2022), ముంజ్య, స్త్రీ 2 (2024) తర్వాత మడాక్ హారర్ కామెడీ యూనివర్స్ లో థామా అయిదో సినిమాగా రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. తాజాగా థామా మూవీ నుంచి విడుదలైన పాయిజన్ బేబీ సాంగ్ లో మలైకా, రష్మిక డ్యాన్స్ ఇంటర్నేట్ ను షేక్ చేస్తుంది. బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ మలైకా అరోరా 51 ఏళ్ల వయసులోనూ తన హాట్ డ్యాన్స్ తో అదరగొట్టింది. జాస్మిన్ సాండ్లాస్, సచిన్-జిగర్, దివ్య కుమార్ పాయిజన్ బేబీ సాంగ్ ను ఆలపించారు. దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించిన థామా మూవీలో సాధారణ వ్యక్తిగా ఉండే ఆయుష్మాన్ ఖురానా అకస్మాత్తుగా రక్త పిశాచిగా మారుతాడు. అతను రష్మిక మందన్నతో ప్రేమలో పడతాడు. వారి ప్రేమలో ఎదురైన సవాళ్లు, వారికి..విలన్ నవాజుద్దీన్ సిద్ధిఖీ మధ్య పోరాటాలతో సినిమా కొనసాగుతుంది.

Latest News