Varanasi Movie – Rana Kumbha Song : ‘వారణాసి’ మూవీ నుంచి ‘రణ కుంభ’ సాంగ్ రిలీజ్

మహేశ్ బాబు–రాజమౌళి ‘వారణాసి’ నుంచి విలన్ పృథ్వీరాజ్‌పై రూపొందించిన ‘రణ కుంభ’ పాటను మేకర్స్ రిలీజ్ చేయగా, ఈ సాంగ్ తాజా ఆప్డేట్‌గా హంగామా చేస్తోంది.

Varanasi Movie Updates

విధాత : మహేశ్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న అడ్వంచర్ యాక్షన్ థ్రిల్లర్ ‘వారణాసి’ నుంచి మేకర్స్ తాజా ఆప్డేట్ గా ‘రణ కుంభ’ అనే పాటను విడుదల చేశారు. ‘ప్రళయం ప్రళయం’ అంటూ సాగే ఈ ‘రణ కుంభ’ పాటను విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్‌ నటిస్తున్న కుంభ పాత్రకు సంబంధించింది కావడం విశేషం.

ఇప్పటికే ఈ పాటను తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన ‘వారణాసి’ సినిమా గ్లోబ్‌ట్రాటర్‌ ఈవెంట్‌లో కుంభ పాత్రను పరిచయం చేస్తూ ప్రజెంట్ చేశారు. ఇదే పాట ఆడియోనూ మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. ‘వారణాసి’ సినిమాకు కేఎల్ నారాయ‌ణ, కార్తీకేయలు నిర్మాతలు వ్యవహరిస్తుండగా..ఎంఎం. కీరవాణి సంగీత అందిస్తన్నారు. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది.

Latest News