విధాత : లేడి సూపర్ స్టార్ గా ఎదిగిన హీరోయిన్ నయనతారకు పుట్టిన రోజు సందర్భంగా భర్త విఘ్నేశ్ శివన ఖరీదైన కానుకను అందించారు. నవంబర్ 19న 41వ బర్త్ డే జరుపుకుంటున్ననయనతారకు ఆమె భర్త విఘ్నేశ్ రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్టర్‌ను గిఫ్ట్‌గా ఇచ్చి విషెస్ చెప్పారు. దీని విలువ సుమారు రూ.10 కోట్లు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నయనకు ప్రతి ఏడాది లగ్జరీ వాహనాలను బహుమతిగా ఇచ్చే విఘ్నేశ్ ఈ సంవత్సరం కూడా ఖరీదైన కారును గిఫ్టుగా అందించడం విశేషం.
2023లో నయన బర్త్ డే కానుకగా విఘ్నేశ్ మెర్సిడెస్ మేబాచ్ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. దీని విలువ రూ.3 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. 2024లో మెర్సిడెస్ బెంచ్ మేబ్యాక్ జీఎల్‌ఎస్ 600ను బహుమతిగా ఇచ్చారు. ఇది రూ.5 కోట్లు ఉంటుందని సమాచారం. ఈ ఏడాది మరింత ఎక్కువగా రూ.10కోట్ల విలువైన గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
పాన్ ఇండియా స్టార్ గా సూపర్ ఫామ్ లో ఉన్న నయనతార తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాతో పాటు మరో సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తో గోపీచంద్ మలినేని రూపొందిస్తున్న ఎన్ బీకే 111 మూవీలో మహారాణి పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం నయన తార వివిధ భాషల్లో 9 సినిమాల్లో నటిస్తుండటం విశేషం.
