Betel Leaf : తమలపాకులో ఎన్నో ఆరోగ్య లక్షణాలున్నాయి. అందుకే తమలపాకును పాన్ రూపంలో, తాంబూలం రూపంలో తీసుకుంటారు. ఈ పాన్‌ను గానీ, తాంబూలాన్ని గానీ భోజనం చేసిన తర్వాత తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే తమలపాకు మంచి జీర్ణకారిగా పనిచేస్తుంది. అందుకే శుభకార్యాల్లో భోజనం తర్వాత తాంబూలం ఇస్తారు. రకరకాల వంటకాలను ఆరగించిన అతిథులు అజీర్తితో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశమే ఈ సంప్రదాయం వెనుకగల కారణం. అయితే తమలపాకును తాంబూలం రూపంలో తీసుకోవడం కంటే.. దాన్ని మరిగించిన నీటిని తాగడంతో ఎక్కువ ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ప్రయోజనాలు..
- పొయ్యి మీద ఒక పాత్ర పెట్టి, ఒక గ్లాసు నీళ్లు పోసి, ఒక తమలపాకును ముక్కలుగా కట్ చేసి అందులో వేయాలి. 5 నుంచి 7 నిమిషాలు మరిగించి ఆ నీటిని వడకట్టి తాగాలి.
- మలబద్దకం సమస్య ఉన్నవారికి ఈ తమలపాకు నీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పేగు కదలికలు బాగా జరిగేలా చేస్తుంది. శరీరంలో వాపులను తగ్గిస్తుంది.
- తమలపాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటంవల్ల ఛాతీలో పేరుకుపోయిన కఫాన్ని తొలగిస్తుంది. అలాగే జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.
- మధుమేహం నియంత్రణలో కూడా తమలపాకు నీరు తోడ్పడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచటమే కాకుండా, మధుమేహం కారణంగా వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తుంది.
- చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను కూడా తమలపాకు నీరు నియంత్రిస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
- తమలపాకులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండుటవల్ల ఆస్తమాను కూడా అదుపులో ఉంచుతుంది.
- అంతేగాక తమలపాకును మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగిస్తున్నారు. ఇది నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. తమలపాకు నోటిలో బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది.
గమనిక : అయితే తమలపాకు నీటిని ఎప్పుపడితే అప్పుడు తాగడం కూడా మంచిదికాదు. రోజులో ఒకసారి మాత్రమే తీసుకోవాలి.