Health Tips | నోటి దుర్వాసన‌తో బాధ‌ప‌డుతున్నారా..? జామ ఆకుల‌తో చెక్ పెట్టండిలా..!

Health Tips | నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. నోటి నుంచి దుర్వాస‌న రావ‌డ‌మే కాకుండా చిగుళ్ల స‌మ‌స్య‌లు, పంటి నొప్పి వంటి స‌మ‌స్య‌లు వెంటాడుతుంటాయి. చాలా మంది ఉద‌యం బ్ర‌ష్ చేయంగనే నోటిని శుభ్రంగా కడుక్కుంటారు. కానీ మ‌ధ్యాహ్నం వ‌ర‌కే నోట్లో నుంచి దుర్వాస‌న వ‌స్తుంటుంది.

  • Publish Date - June 23, 2024 / 07:21 AM IST

Health Tips | నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. నోటి నుంచి దుర్వాస‌న రావ‌డ‌మే కాకుండా చిగుళ్ల స‌మ‌స్య‌లు, పంటి నొప్పి వంటి స‌మ‌స్య‌లు వెంటాడుతుంటాయి. చాలా మంది ఉద‌యం బ్ర‌ష్ చేయంగనే నోటిని శుభ్రంగా కడుక్కుంటారు. కానీ మ‌ధ్యాహ్నం వ‌ర‌కే నోట్లో నుంచి దుర్వాస‌న వ‌స్తుంటుంది. దీంతో స‌ద‌రు వ్య‌క్తి ఇత‌రుల‌తో మాట్లాడేట‌ప్పుడు చాలా ఇబ్బంది ప‌డుతుంటారు. ఇలా నోటి దుర్వాస‌న‌తో పాటు దంత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారికి జామ ఆకు (Guava) మంచి ఔష‌ధం. ఈ జామ ఆకుతో దంత స‌మ‌స్య‌ల‌తో పాటు నోటి దుర్వాస‌న‌కు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

జామ కాయ తిన‌డం వ‌ల్ల ఎలాంటి ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొందుతామో.. జామ ఆకు తిన‌డం వ‌ల్ల కూడా అలాంటి లాభాలే పొందుతాము. జామ ఆకుల్లో ఫైబర్, విటమిన్ సి, ఎ, పొటాషియం, మాంగనీస్ వంటి ఇతర పోషకాలు ఎన్నో పుష్కలంగా ల‌భిస్తాయి. అలాగే.. యాంటీ ఇన్​ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి గాయాలను నయం చేయడంలో చాలా బాగా పని చేస్తాయంటున్నారు.

అదేవిధంగా నోటి సంరక్షణలో.. సహాయపడే యాంటీమైక్రోబయాల్ ట్రస్టెడ్ సోర్స్ యాక్టివిటీనీ జామ ఆకులు కలిగి ఉంటాయని చెబుతున్నారు. కాబట్టి.. పంటి నొప్పి, చిగుళ్ల సమస్యలు, నోటి దుర్వాసన వంటి సమస్యలు తలెత్తినప్పుడు తాజా జామ ఆకులను శుభ్రంగా కడిగి తింటే చాలని అంటున్నారు. లేదంటే.. జామ ఆకులను మెత్తగా తరిగి వేడి నీటిలో ఉడకబెట్టాలి. మ‌రిగిన నీటి​తో పుక్కిలించినా దంత, చిగుళ్ల సమస్యలు దూరం అవుతాయంటున్నారు నిపుణులు.

ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను నియంత్రిస్తాయి..

జామ ఆకులు కేవలం నోటిని శుభ్రంగా ఉంచ‌డ‌మే కాదు.. మరికొన్ని సమస్యలను నివారించడంలో చాలా బాగా పనిచేస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ ఆకుల్లో విటమిన్ సితో యాంటీ అలర్జీ గుణాలు ఉంటాయి. కాబట్టి జలుబు, దగ్గు, గొంతు నొప్పిని తగ్గించడానికి ఇవి పనిచేస్తాంటున్నారు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో జామ ఆకులు సహాయపడతాయట. అదేవిధంగా ఫైబర్ అధికంగా ఈ ఆకులు తినడం ద్వారా అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గి జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాదు.. అదనపు శరీర బరువును తగ్గించడంలో కూడా జామ ఆకులు సహాయపడతాయని చెబుతున్నారు నిపుణులు.

Latest News