Exercise | ‘ఎక్స‌ర్‌సైజ్’ ఏ స‌మ‌యంలో చేస్తే మంచిది..! ఉద‌య‌మా..? సాయంత్ర‌మా..?

Exercise | ఎక్స‌ర్‌సైజ్( Exercise ) చేయాల‌ని ప్ర‌తి ఒక్క‌రికి ఉంటుంది. కానీ అంద‌రికీ సాధ్యం కాదు. ఎందుకంటే ఉద‌యం( Morning ) మాత్ర‌మే వ్యాయామం చేయాల‌నే భ్ర‌మ అంద‌రిలో ఉంటుంది. కానీ సాయంత్రం( Evening ) వేళ కూడా వ్యాయామం చేయొచ్చు ఆరోగ్య నిపుణులు( Health Experts ) చెబుతున్నారు. మ‌రి ఈ రెండింటిలో ఏ స‌మ‌యం ఉత్త‌మ‌మో ఈ క‌థ‌నంలో తెలు అనిసుకుందాం.

Exercise | ప్ర‌తి ఒక్క‌రూ బిజీ లైఫ్ గ‌డుపుతున్నారు. మంచి నీళ్లు తాగేందుకు కూడా కొంద‌రికి తీరిక ఉండ‌డం లేదు. బిజీ షెడ్యూల్ కార‌ణంగా ఆరోగ్యంగా ఉండేందుకు ప్ర‌తి రోజు చేయాల్సిన వ్యాయ‌మానికి( Exercise ) కూడా స‌మ‌యం కేటాయించ‌డం క‌ష్టంగా మారింది. అయితే ఉద‌యం( Morning ) వీల‌వ‌డం లేద‌ని ఎక్స‌ర్‌సైజ్ చేయ‌డమే మానేస్తుంటారు కొంద‌రు. క‌నీసం సాయంత్రం( Evening ) స‌మ‌యంలోనైనా వ్యాయామం చేయ‌రు. అయితే ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో వ్యాయామం ఉద‌యం చేస్తే మంచిదా..? సాయంత్రం చేస్తే మంచిదా..? అనేదానిపై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతుంటారు. మ‌రి ఏ స‌మ‌యంలో ఎక్స‌ర్‌సైజ్ చేస్తే బెట‌రో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

ప్ర‌తి రోజు ఓ అర గంట పాటు వ్యాయామం చేయ‌డం వ‌ల్ల శ‌రీరమంతా ఉల్లాసంగా ఉంటుంది. మెద‌డు కూడా చురుకుగా ప‌ని చేస్తుంది. కండ‌రాల ప‌నితీరు కూడా మెరుగుప‌డుతుంది. హార్మోన్లు స‌మ‌తుల్యంగా ఉంటాయి. మొత్తానికి ఆరోగ్యవంతంగా ఉండేందుకు ఎక్స‌ర్‌సైజ్ ఉప‌యోగప‌డుతుంది.

ఏ స‌మ‌యంలో వ్యాయామం చేస్తే మంచిది..?

వ్యాయామం చేసేందుకు ఉద‌యం, సాయంత్రం.. రెండు స‌మ‌యాలు మంచివేన‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉద‌యం వేళ ఎక్స‌ర్‌సైజ్ చేయ‌డం వ‌ల్ల శ‌రీరం ఉల్లాసంగా ఉటుంది. ఏకాగ్ర‌త పెరుగుతుంది. మాన‌సికంగా దృఢంగా ఉంటారు. రోజంతా చురుకుగా ఉండి త‌మ ప‌నుల‌ను అవ‌లీల‌గా పూర్తి చేస్తారు. మ‌రి ముఖ్యంగా ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల ఫ్యాట్ బర్న్ అవుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఉదయ వ్యాయామం మంచి ఎంపిక. జీవక్రియ మెరుగై.. ఆకలి అదుపులో ఉంటుంది. రోజంతా హెల్తీ ఫుడ్ తినేందుకు హెల్ప్ అవుతుంది. స్లీప్ సైకిల్ మెరుగవుతుంది. కాలక్రమేణా మంచి నిద్ర మీ సొంతమవుతుంది.

మ‌రి సాయంత్రం వ్యాయామం..?

ఉద‌యం వీలుకాని వారు సాయంత్రం వేళ వ్యాయామం చేస్తుంటారు. పొద్దంతా ప‌ని చేసి సాయంత్రం ఓ అర‌గంట పాటు ఎక్స‌ర్‌సైజ్ చేస్తే కాస్త ఒత్తిడి త‌గ్గుతుంద‌ని భావిస్తారు. కండ‌రాల్లో ఒత్తిడి విడుద‌లై విశ్రాంతి ల‌భిస్తుంది. హార్మోన్ స్థాయిలు కూడా గ‌రిష్ట స్థాయికి చేరుకుంటాయ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సాయంత్రం వ్యాయామం నాడీ వ్యవస్థను అధికంగా ఉత్తేజితం చేస్తుంది. దీనివల్ల విశ్రాంతి తీసుకోవడం, నిద్రపోవడం కష్టతరం అవుతుంది. కాబట్టి నిద్రకు ఓ మూడు, నాలుగు గంటల ముందు వ్యాయామం చేస్తే మంచిది.

రెండింటిలో ఏది ఉత్త‌మం..?

ఉదయం లేదా సాయంత్రం వ్యాయామం చేయడం అనేది సమయాన్ని బట్టి ప్రత్యేక ప్రయోజనాలు ఇస్తుంది. ఎప్పుడు చేయాలనేది కూడా మీ లైఫ్​ స్టైల్​ బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ ఉదయం వ్యాయామం చేస్తే ఫలితాలు కాస్త మెరుగ్గా ఉంటాయి. బరువు తగ్గేందుకు మార్నింగ్.. బాడీ బిల్డ్ చేసుకోవడానికి సాయంత్రం అనువైనదిగా ఉంటుంది కాబట్టి.. మీకు అవసరాలకు అనుగుణంగా దీనిని ఎంచుకోవాలి. అస్సలు వ్యాయామం చేయకపోవడం కన్నా.. ఏదొక సమయంలో వ్యాయామం చేస్తే వెయ్యి రెట్లు మంచిది.

 

Latest News